మళ్ళీ ఎన్టీఆర్ నే నమ్ముకున్న చరణ్.. గ్లోబల్ ఇమేజ్ వచ్చినా ఈ తిప్పలు తప్పట్లేదే..!?

మనకు తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ మంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం బయటపడింది . అయితే చాలా విషయాలలో ఎన్టీఆర్ చరణ్ కి హెల్ప్ చేశాడు అంటూ ఆలస్యంగా తెలిసింది. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తన పాత్ర కన్నా చరణ్ పాత్ర కీలకంగా మారబోతుంది అని తెలిసిన కూడా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం అప్పుడు హైలైట్ గా మారింది .

రీసెంట్ గా మరోసారి ఎన్టీఆర్ టైటిల్ ని వాడుకోబోతున్నాడు చరణ్ అన్న వార్త వైరల్ అవుతుంది. గేమ్ చేంజర్.. సినిమా షూట్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే.. సినిమాను సెట్స్ పై కి తీసుకురాబోతున్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 20న ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది . అయితే ఈ సినిమాకి “పెద్ది” అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారట .

ఈ టైటిల్ ని గతంలో ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు అనుకున్నాడు అంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి . అదే టైటిల్ ని ఇప్పటికి చరణ్ కి ఫిక్స్ చేసేసాడు అట . ఎన్టీఆర్ టైటిల్ చరణ్ వాడుకోవడం పట్ల అభిమానులు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా వైరల్ గా మారింది. కాగా ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా షూట్ లో ఉన్నాడు . ఆ తర్వాత వార్ 2 షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రంబోలా చేయడానికి సిద్ధమైపోయాడు..!!