చరణ్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.. మెగాస్టార్ కాదు..అస్సలు గెస్ చేయలేరు..!

మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హీరోయిన్ కి తమకంటూ ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉంటారు . మనకి కూడా ఎంతమంది హీరోల సినిమాలు చూసిన ఫేవరెట్ అంటూ ఒకరుంటారు. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ .. ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు .

అంతే కాదు రామ్ చరణ్ తన తండ్రిని మించిపోయాడు అన్న కామెంట్స్ కూడా దక్కించుకున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయాన్ని బయట పెట్టేసాడు . జనరల్ గా మనం అనుకుంటూ ఉంటాం.. స్టార్ హీరోకి తన తండ్రి మొదటి హీరో అని .. అఫ్కోర్స్ అది నిజమే . కానీ రామ్ చరణ్ కి తన తండ్రి ఒక గురువు .. రోల్ మోడల్ .

అయితే ఆయన ఎక్కువగా యాక్టింగ్ నచ్చే హీరో మాత్రం స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అంటూ ఇంటర్వ్యూలో బయటపెట్టారు . “చిరంజీవి మా నాన్ననే ఆయన నా రోల్ మోడల్ ..ఇన్స్పిరేషన్ నాకు యాక్టింగ్ పరంగా బాగా ఆకట్టుకునే హీరో మాత్రం ఎన్టీ రామారావు గారు “అంటూ చిరుత సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . మరొకసారి అదే మాటలని ట్రై చేస్తున్నారు నందమూరి అభిమానులు. మొదటినుంచి మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య సన్నిహిత్యం బాగానే ఉంది . ఫ్యాన్స్ సినిమాల విషయంలో గొడవలు పడుతూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా చరణ్ – తారక్ – చిరంజీవి – బాలకృష్ణ పర్సనల్ ఇష్యూస్ కి దూరంగా ఉంటారు..!!