ప్రణతి కి ఎన్టీఆర్ అంటే అంత ఇష్టమా..? ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా అలానే సేవ్ చేసుకుందా..?

అఫ్కోర్స్ భార్య అంటే భర్తకి ..భర్త అంటే భార్యకి ఇష్టం ఉంటుంది . ఇందులో పెద్ద విచిత్రం ఏముందా..? అని అనుకుంటున్నారా..? అందరూ భార్యాభర్తలు ఒకేలా ఉండరు ..ఉంటే వాళ్ళు భార్యాభర్తలు అని అనిపించుకోరు . ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా కూడా ట్రెడిషనల్ లవబుల్ గా పేరు సంపాదించుకుంది మాత్రం ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి అని చెప్పక తప్పదు .

లక్ష్మీ ప్రణతి చాలా సైలెంట్ ఆ విషయం అందరికీ తెలిసిందే . బయట కూడా పెద్దగా ఎక్కువగా కనిపించడు. తన భర్త తన పిల్లలే తన ప్రపంచం అంటూ జీవిస్తూ ఉంటుంది. కాగా లక్ష్మీ ప్రణతికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లక్ష్మీ ప్రణతి తన ఫోన్లో .. ఎన్టీఆర్ నెంబర్ ను కన్నయ్య అని సేవ్ చేసుకుందట . లక్ష్మీ ప్రణతికి మొదటి నుంచి కృష్ణుడు అంటే ఆరాధ దైవమట.

కృష్ణుడిని బాగా కొలుస్తుందట. అంతేకాదు ఆమె జూనియర్ ఎన్టీఆర్ ని కన్నయ్య అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటుందట. అదే నేమ్ తో తన మొబైల్ లో సేవ్ చేసుకుందట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హౌ క్యూట్ అంటూ పొగిడేస్తున్నారు . మీ జంట ఎప్పుడూ ఇలాగే సుఖసంతోషాలతో జీవించాలి అంటూ బ్లెస్స్ చేస్తున్నారు. లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ లది పెద్దలు కుదిర్చిన వివాహం . వీళ్ళ పెళ్లి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . వీళ్ళకి ఇద్దరు పిల్లలు.. అభయ్ రామ్ భార్గవ్ రామ్.. ఇద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ లాగే చాలా ముద్దుగా క్యూట్ గా ఉంటారు..!!