అల్లు అర్జున్ హీరో కాకపోయి ఉంటే..ఏం అవుదాము అనుకున్నాడో తెలుసా..?

లైఫ్ లో మనం అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది లైఫ్ గా ఉండదు. కొన్నిసార్లు మనం ఊహించినవి అనుకోనివి జరుగుతూ ఉంటాయి. అది అంతా మన మంచికే అని ముందుకు వెళ్లిపోవాలి . ప్రెసెంట్ అలాంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్.. డాడీ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించినప్పటికీ….

గంగోత్రి సినిమా ద్వారా స్టార్ హీరోగా మారాడు. ఈయన ఇప్పుడు పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. పుష్ప2తో ఇండస్ట్రీని ఏలేయ్యడానికి రెడీ అయిపోతున్నాడు బన్నీ . నిజానికి బన్నీ సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావాలి అని అనుకోలేదట . ఏదో సరదాగా డాన్స్ చేస్తున్నారు.. తప్పిస్తే ఆయన ఇంత పెద్ద హీరో అవుతాను అని ఎప్పుడూ ఊహించలేదట.

బన్నీకి మల్టీమీడియా కోర్సెస్ అంటే అప్పట్లో పిచ్చి ఉండేదట . మల్టీమీడియా కోర్సెస్ కూడా బాగా నేర్చుకున్నారట. గ్రాఫిక్స్ – యానిమేషన్ మీద వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండేదట . ఒకవేళ ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ కాకపోయి ఉంటే మాత్రం కచ్చితంగా అటువైపు సెటిల్ అయ్యి ఉండేవాడిని అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . బన్నీ మల్టీ టాలెంటెడ్ అంటూ పొగిడేస్తున్నారు . మరికొందరు నువ్వు హీరో అవ్వాలని రాసి పెట్టింది.. హీరో అయ్యావు ఇక నీదే ఇండస్ట్రీ దున్నేసేయ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!