“ఇండస్ట్రీకి దొరికిన మరో సాయి పల్లవి ఈమె” .. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

రాజమౌళిని మెప్పించడం చాలా చాలా కష్టం అంటూ ఉంటారు జనాలు . ఎన్టీఆర్ – తారక్ కూడా అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చారు . ఇండస్ట్రీలో చాలామంది రాజమౌళి పెద్ద శాడిస్ట్ అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి రాజమౌళి ఓ హీరోయిన్ ని పొగిడేసారు అంటే ఆమెలో కచ్చితంగా అంతో ఇంతో టాలెంట్ ఉండే ఉంటుంది . ప్రజెంట్ దానికి సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

ఈ మధ్యకాలంలో రాజమౌళి చేసిన ట్వీట్ ఒకటి బాగా వైరల్ గా మారింది . లేటెస్ట్గా అభిమానులకు అలాగే యువతకు బాగా నచ్చేసిన సినిమా ప్రేమలు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో యంగ్ హీరోయిన్ కు డైరెక్టర్ రాజమౌళి ఇచ్చిన ప్రశంసలు అన్ని ఇన్ని కాదు . “చాలా చక్కగా మాట్లాడుతుంది.. చక్కగా నటిస్తుంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు”. నిజానికి రాజమౌళి ఏ హీరోయిన్ ని కూడా ఈ రేంజ్ లో పొగడడు.. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైనే పడింది.

ఆమె పేరే మమితా బైజు. ఎవరి మమితా బైజు..? ఎందుకు ఆమె అంత స్పెషల్ గా మారిపోయింది అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలయాళం లో విజయవంతమైన ప్రేమలు సినిమాని అదే పేరుతో రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే . కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలు అయినా ఆదరిస్తారు జనాలు అని చెప్పడానికి ఇది ఒక మరో ఎగ్జాంపుల్ . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా మారింది. మమితా బైజు రాజమౌళి కూడా ఆమెను కు ఫిదా అయిపోయాడు. దీంతో ఓ రేంజ్ లో పొగిడేసారు . ఇండస్ట్రీకి దొరికిన మరో సాయి పల్లవి అంటూ పరోక్షంగా కామెంట్స్ చేశారు . దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు మమితా బైజు పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!