రెండో పెళ్లి పై నీహారిక సంచలన కామెంట్స్.. నాగబాబు ఎలా తట్టుకుంటాడో ఏమో..?

మెగా డాటర్ నిహారిక సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నిహారిక సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది. ఆఫ్కోర్స్ అంతకుముందు కూడా ఉండేది … కానీ ఈ మధ్యకాలంలో మాత్రం చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ వస్తుంది రీసెంట్గా ఆమె సాగు అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రజెంటర్గా వ్యవహరిస్తూ వచ్చింది. సాగు మూవీ నేరుగా ఓటీడీలోకి రానుంది . ఈ క్రమంలోనే.. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక.. తన రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . “నేను ప్రేమకి వ్యతిరేకరాలను కాదు.. నాకు పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం.. లైఫ్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా వెళ్ళదు.. లైఫ్ అనేది ఒక సైకిల్ .. సాగు మూవీలో అదే చూపించబోతున్నాము” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో యాంకర్ ..”అంటే మిమ్మల్ని మళ్లీ పెళ్లికూతురుగా మేము చూడవచ్చా ..?” అంటూ పరోక్షకంగా రెండో పెళ్లిపై ప్రశ్నించింది .

“అమ్మో అది తెలియదు కానీ నాకు పిల్లలు కావాలి ..కాబట్టి పెళ్లి చేసుకోవాలి. పిల్లలనే చెప్పలేము.. కానీ నాకు లవ్ మీద మాత్రం ఎటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ లేదు “అంటూ పరోక్షకంగా రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకు వచ్చేసింది . దీంతో మెగా ట్రోలర్స్ మళ్లీ నిహారికను ఆడేసుకుంటున్నారు . మరోచైతన్య బలి కాబోతున్నాడా..? అంటూ వెటకారంగా వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తుంటే.. ఈసారి నువ్వు డివోర్స్ తీసుకుంటే నాగబాబుగారు ఎలా తట్టుకుంటారో ఏమో ఈసారైనా మంచిగా బుద్ధిగా కాపురం చేసుకో ..ఆల్ ద బెస్ట్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!