తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా.. వామో ఈ అలవాటుతో ఇన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయా ..?!

చాలామంది పిల్లలు తిన్న వెంటనే స్నానానికి వెళుతూ ఉంటారు. ఇంట్లో పెద్దలు కూడా అలా చేయడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. అయితే వారి మాటలను పట్టించుకోకుండా మూఢనమ్మకాలని చాలామంది కొట్టేస్తూ ఉంటారు. కానీ ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెప్ప‌డం వెనుక చాలా సైంటిఫిక్ రీజ‌న్‌లు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే తిన్న వెంటనే స్నానం చేయడం మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో ప్రతి పనికి కొంత టైం కేటాయించాల్సి ఉంటుంది. తిన్న వెంటనే బాడీలో ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే శరీరానికి సరిపడా ఉష్ణోగ్రత ఉండాలి. అయితే తినవెంటనే మనం స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి శరీరం చల్లబడుతుంది.

మనం తినే ఆహారంలో ప్రోటీన్, పీచు, కొవ్వు పదార్థాలు ఉంటూనే ఉంటాయి. దాని వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవచ్చు. కడుపు ఉబ్బరం, బరువు పోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే రక్తనాళాలు వ్యాకోచించే చర్మానికి రక్తప్రసరణను మరింతగా పెంచుతాయి. ఇక తిన వెంనే మీరు స్నానం చేస్తే శరీరంలో ఓ యాసిడ్ రిలీజై బాడీ కూల్ అయ్యేలా చేస్తుంది. ఈ యాసిడ్ రక్తనాళాలను విస్తరిస్తుంది. మరియు రక్తాన్ని నరాల మరియు చిన్న నరాలకు వేగంగా ప్రయాణించేలా చేస్తుంది. ఇలా బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల ఆ బ్లడ్ మీ స్కిన్ లోకి అడ్జస్ట్ అయిపోతుంది. ఇది శరీరానికి అసలు మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. కనుక భోజనం చేసిన వెంటనే స్నానం చేయకండి. అలాగే ఆహారం తిన్న వెంటనే స్నానం మాత్రమే కాదు.. పళ్ళు కూడా తోముకోకూడదు. కొందరు తిన్న వెంటనే పళ్ళు తోముకుంటారు.

ఇలా చేయడం వల్ల దంతాల ఆరోగ్యానికి మంచిదని ఎటువంటి సమస్యలు రావని భావిస్తారు. అయితే ఇది ప‌ళ్ళ సమస్యలకు కూడా దారితీస్తుంది. కనుక మీరు తిన్న 30 నిమిషాల తరువాత దంతాలను బ్రష్ చేసుకుంటే మంచిది. తిన్న వెంటనే స్విమ్మింగ్ కూడా చేయకూడదు. ఇది జీర్ణ వ్యవస్థకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తుంది. 30 నిమిషాల్లో లేదా ఒక గంట పాటు గ్యాప్ తీసుకున్న తర్వాత ఈత కొట్టడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం జరుగుతుంది. అలాగే ఫుడ్ తీసుకున్న వెంటనే ఎక్సైజ్ చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదట. అలాగే తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోయి బరువు అధికంగా మారే సమస్య వస్తుంది. కనుక తిన్న వెంటనే నిద్రపోకూడదు ఇంకా ఆహారం తిన్న వెంటనే చేయకూడని ఈ పై చెప్పిన విషయాలను గుర్తుంచుకోండి.