అలాంటి పని చేయబోతున్న ఎన్టీఆర్ .. నందమూరి ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఓ బాగా ట్రెండ్గా మారిపోయింది. గతంలో రిలీజ్ అయి హిట్ కొట్టిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం .. గతంలో బాగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం ..రెండూ కూడా స్టార్ హీరోస్ ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య నటించిన బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్లో ఎన్టీఆర్ నటించబోతున్నారు అన్న వార్త బాగా బాగా ట్రెండ్ అవుతుంది.

నందమూరి నరసింహం గా ఇండస్ట్రీలో క్రేజ్ దక్కించుకున్న బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా “బైరవద్వీపం”. ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అని కొన్ని సంవత్సరాలుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే సీక్వెల్ వచ్చిన బాలయ్య నటిస్తాడు.. ఆ సినిమాలో అనుకున్నారే తప్పిస్తే .. మరో హీరో నటిస్తారు అని ఎవరు ఊహించలేకపోయారు.

అయితే త్వరలోనే భైరవద్వీపం కి సీక్వెల్ రాబోతుంది అని.. అయితే బాలయ్య కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే బాలయ్య చేసిన ఆ పాత్రను ఎన్టీఆర్ చేసి మెప్పించగలడా..? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి . మరికొందరు నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఆ సినిమా సీక్వెల్ చేస్తే ఊరుకుంటారా..? అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!