35 ఏళ్ళుగా రాత్రుల్లు అదే పని చేస్తున్న నాగార్జున.. నువ్వు నిజంగా మన్మధుడివే బాసూ..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎక్కువగా డైటింగ్ చేస్తూ ఉంటారు . హీరోయిన్లు అయితే అసలు చెప్పనవసరం లేదు. కడుపునిండా అన్నం తిని వాళ్ళు ఎంతకాలం అవుతుందో వాళ్లకే గుర్తుండాలి. అయితే సినిమా ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ఎప్పుడు హ్యాండ్సమ్ లుక్స్ లోనే కనిపిస్తాడు . అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన స్టైల్ లో నటిస్తూ మెప్పిస్తూ వచ్చాడు. రీసెంట్గా వచ్చిన నా సామి రంగా సినిమాలో కూడా తనదైన స్టైల్ లో మెప్పించాడు .

కాగా నాగార్జున ఇంత ఏజ్ వచ్చినా కూడా హ్యాండ్సమ్ గా కనిపించడానికి సీక్రెట్ ఏంటి అన్న విషయం ఇప్పుడు బయటపడింది . జనరల్ గా అందరూ అనుకుంటూ ఉంటారు ..నాగార్జున అసలు అన్నం తినడు .. ఆయిల్ ఫుడ్స్ తినడు అని.. అది తప్పు నాగార్జున అన్ని ఫుడ్స్ మనలాగే తింటాడట . ఈవెన్ చాక్లెట్స్ – ఐస్ క్రీమ్స్ కూడా బాగా తింటాడట . మరీ ముఖ్యంగా రాత్రి డిన్నర్ తర్వాత కచ్చితంగా ఆయన ఏమి స్వీట్ ఖచ్చితంగా తింటాడట. డైట్ ఫాలో అవ్వడట.

కానీ తిన్నది మటుకు లిమిట్ గా తింటాడట . ఆ కారణంగానే నాగర్జున ఇంత అందంగా ఇంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . గత 35 ఏళ్లుగా ఒకే డైట్ లో ఫాలో అవుతున్నాడు నాగార్జున అన్న విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జునకి ఇద్దరు కొడుకులు .. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు . అయితే ఇంత ఏజ్ లోను నాగార్జున హ్యాండ్ సమ్ లుక్స్ లో ఆకట్టుకుంటూ అమ్మాయిల కలల రాకుమారుడుగా వెలిగిపోతున్నాడు . దీంతో కొందరు అక్కినేని ఫ్యాన్స్ ఫన్నీగా నాగ్ పై కామెంట్స్ కౌంటర్స్ వేస్తున్నారు..!!