“సమంత చెప్తున్నవన్నీ అబద్ధాలే “.. సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన డాక్టర్..!

సమంత ఈ మధ్యకాలంలో హెల్త్ పాడ్ కాస్ట్ పేరిట ఆమె చేస్తున్న వీడియోస్ ఎలా వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే . మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత ..తన హెల్త్ పట్ల తాను ఫేస్ చేసిన సిచువేషన్ అందరికీ తెలిసేలా జనాలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ..ఈ హెల్త్ పాడ్ కాస్ట్ ను స్టార్ట్ చేసింది. అయితే ఆ హెల్త్ పాడ్ కాస్ట్ వీడియోస్ సమంత మాట్లాడిన మాటలకు సంబంధించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఇటీవల సమంత ఓ వీడియో చేసింది . యూట్యూబ్ పాడ్ కాస్ట్ పేరిట కొన్ని ఆరోగ్య చిట్కాలను అభిమానులతో పంచుకుంటున్న ఈ బ్యూటీ ఆ సిరీస్ లో భాగంగా “అండర్స్టాండింగ్ ఆటో ఇమ్యూనిటీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది”.

అయితే ఈ వీడియో పై ప్రముఖ డాక్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. సమంత పాడ్ క్యాస్ట్ పై సంచలన కామెంట్స్ చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ” డాండెలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి ఉత్తమ ఔషధం అని ..సమంత చెప్పడం అస్సలు మంచిది కాదు అని.. అది సరైన పద్ధతి కాదు అని .. అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు తన ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి తప్పు దోవ పట్టిస్తున్నారు” అంటూ మండిపడ్డాడు . ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

అంతేకాదు సమంత అంటే ముందు నుంచి పడని వాళ్ళు కూడా ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . సమంత అందరిని చీట్ చేస్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు. సమంత ఇండస్ట్రీలో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . మంచి సినిమాలు వస్తే నటిస్తాను అంటూ డైరెక్టర్ కి చెప్పుకొస్తుందట. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్దగా అవకాశాలు ఆమె దక్కించుకోకపోవడం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం కుప్పలు తెప్పలుగా అవకాశాలు వస్తున్నాయి..!!