కోట్ల ఆస్తి ఉన్న జాన్వీకి ఆ అదృష్టమే లేదు.. ఏ జన్మలో ఏం పాపం చేసిందో..?

జాన్వి కపూర్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరే ఇది. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురిగా బాగా పాపులారిటీ ప్రచారం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేవర అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది అంటే ఈ బ్యూటీ ఎంత లక్కీనో అర్థం చేసుకోవచ్చు . అయితే దేవర సినిమా రిలీజ్ అవ్వకముందే ఆమె తెలుగులో మరో సినిమాను కూడా అందుకోవడం.. ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా ఉంది.

ఓ పక్క హీరోయిన్స్ అవకాశాలు లేక అల్లాడుతూ ఉంటే ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది . కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ కి సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ గా మారింది . జాన్వికపూర్ చాలా అదృష్టవంతురాలు ..కాలు కింద పెట్టనీకుండా చూసుకునే పనివాళ్ళు .. ఏది అడిగిన కొనిచ్చే నాన్నగారు..

కోరికలు తీర్చే బాయ్ ఫ్రెండ్ ..అందరూ పక్కనే ఉన్నారు అని.. అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి అని ..షి ఇస్ సో లక్కీ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే కొందరు అదే పాజిటివిటీని నెగిటివిటీగా మార్చేస్తున్నారు. ఎంతమంది పక్కన ఉన్న తన తల్లి లేకపోవడం తనకు తీర్చలేని బాధ అని ..జాన్వి కపూర్ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా అది చూసి ఎంజాయ్ చేయడానికి తన తల్లి పక్కన లేదని ఏ జన్మలో ఏ పాపం చేస్తుందో చిన్న ఏజ్ లోనే తల్లిని పోగొట్టుకుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!