“అమ్మానాన్న చూస్తారని భయమేసింది ..అర్ధరాత్రి బాత్ రూమ్లో షవర్ కింద అలా చేశాను”..దివి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని.. చాలామంది అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఎంత కష్టమైనా.. ఎంత నష్టమైనా సరే భరించి తమ కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది దివి . ఇలా చెప్పడం కన్నా బిగ్ బాస్ దివి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . ప్రజెంట్ దివి నటించిన సినిమా లంబసింగి . ఈ సినిమా ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది . ఈ సినిమా కోసం దివి ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుందో కూడా మనం చూస్తున్నాం. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యి తన సినిమాను ప్రమోట్ చేసుకోవాలనుకున్న దివి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

కెరియర్ స్టార్టింగ్ లో సన్నగా ఉంటే లావు అవ్వాలని .. లావు ఉంటే సన్నగా అవ్వాలని ఎన్నో ఎన్నో కండిషన్స్ పెట్టారట . అవకాశాల కోసం ప్రతిదీ చాలా ఇష్టంగా ఓపికగా భరించిందట. తీరా వాళ్ళు చెప్పిన విధంగా అన్ని చేసుకొని వెళ్తే రేపు కాల్ చేస్తాం.. మాపు కాల్ చేస్తామంటూ హ్యాండ్ ఇచ్చేవారట . రీసెంట్ గా కూడా రవితేజ తో నటించే ఛాన్స్ వచ్చిందని .. ఫైవ్ డేస్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు అని ..రాత్రికి రాత్రి ఫోన్ చేసి నిన్ను తీసుకోవడం లేదు అంటూ చెప్పారని ..అప్పుడు చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది .

“మంచం పై పడుకొని దిండు ముఖంపై పెట్టుకొని చాలా చాలా ఏడ్చాను అని.. ఎక్కడ మా పేరెంట్స్ చూస్తే బాధపడతారో అని తెలిసి అర్ధరాత్రి బాత్ రూమ్ లోకి వెళ్లి షవర్ కింద తలపెట్టి నోరు మూసుకొని గట్టిగా ఏడుస్తూ నా బాధను దిగమింగుకున్నాను అని” దివి ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది. ఇది తెలుసుకున్న అభిమానులు చాలా ఫీల్ అయిపోతున్నారు. ఇంత టాలెంటెడ్ హీరోయిన్ ని ఎందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ పట్టించుకోవట్లేదు అంటూ చెప్పుకొస్తున్నారు.