అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..మళ్లీ తెలుగు సినిమాకి సైన్ చేసిన సంయుక్తా మీనన్..హీరో ఎవరంటే..?

సంయుక్త మీనన్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా.. తక్కువే ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు ఇప్పటివరకు ఆమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి హిట్ అవ్వడం గమనార్హం . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలు కూడా సంయుక్త మీనన్ తో సినిమాలు చేయాలి అని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్ తో ఆమె ఏకంగా రెండు సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకుంది.

రెండు కూడా మంచి హిట్ అందుకున్నాయి. కాగా గత కొంతకాలంగా సంయుక్త మీనన్ తెలుగు సినిమాలకు సైన్ చేయడం లేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా సంయుక్త మీనన్..ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతుంది అని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వబోతుంది అని ప్రచారం జరుగుతూ వచ్చింది .

అయితే వాటికి చెక్ పెట్టేసింది సంయుక్త. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో హీరోయిన్గా సంయుక్తా మీనన్ సెలెక్ట్ అయింది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరిగిన ఫైనల్లీ ఆమె ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!