రాజమౌళి చెప్పిన ఆ విషయానే నేను ఇప్పటికీ ఫాలో అవుతున్అవుతున్నా.. ఆలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ కీలాక పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలో ఆలియా భట్ రాజమౌళి మధ్యన ఏదో గొడవ జరిగిందంటూ వార్తలు గతంలో తెగ వైరల్ అయ‌న‌ సంగతి తెలిసిందే. అయితే వాటిలో నిజమెంతుందో తెలియదు గానీ.. తాజాగా అలియా భట్ రాజమౌళి పై చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. అలియా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తనకు రాజమౌళి ఇచ్చిన సజెషన్ ఇప్పటికీ ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చింది. అలా నేను పూర్తిగా నా పద్ధతిని మార్చుకున్నాను అంటూ వివరించింది.

Alia Bhatt reveals what 'RRR' director SS Rajamouli advised her about  choosing films: 'Even if the film doesn't work...' | - Times of India

సినిమాలను ఎంచుకునే టైంలో మొదటి నుంచి నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండేదాన్ని.. ఇదే విషయాన్ని ఓ టైంలో రాజమౌళికి చెప్పానని వివరించింది. ఏది చేసినా ప్రేమతో చేయండి.. అప్పుడు అది ఎంత కష్టమైనా పాత్ర అయినా మీకు సులువుగా అనిపిస్తుంది. ఎలాంటి ఫలితం వచ్చినా సరే ప్రేక్షకులు మీ నటనను మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారని చెప్పారని.. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏది ఉండదు అంటూ వివరించారని.. ఆయన చెప్పిన ఈ మాటలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను అంటూ వివ‌రించింది.

Alia Bhatt shares SS Rajamouli's advice on choosing films: Do it with love  - India Today

సినీ కెరీర్ స్టార్టింగ్ లో నా దగ్గరికి వచ్చిన ప్రతి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దాన్ని. వాస్తవానికి నాకు పేషన్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారింది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా నటించడానికి ఫిక్స్ అయిపోయా అంటూ అలియాభట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈమె రాజమౌళి చెప్పిన ఆ విషయాలను ఇప్పటికీ పాటిస్తున్న అంటూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. ఇక ఆలియా ప్రస్తుతం జిగ్ర అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.