గ్రాండ్ లెవెల్ లో భూమా మౌనిక శ్రీమంతం సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సినిమాల‌లో ఎంతో మంది క్రేజ్‌ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకడు. మ‌నోజ్‌ గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే కొన్ని కారణాలతో మనోజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో మంచు మనోజ్ ఇక‌పై సినిమాల్లో కనిపించడని.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయంటూ ఎన్నో రకాల వార్తలు వైరల అయ్యాయి. అయితే తాజాగా వాటన్నింటికి చెక్‌ పెడుతూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు ఈ మంచు వారి వారసుడు. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్న మనోజ్.. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నాడు. ఇక గతేడాది మార్చ్ 3న భూమా మౌనిక రెడ్డిని గ్రాండ్ లెవెల్లో వివాహం చేసుకున్నాడు మనోజ్.

ఎంతో సింపుల్‌గా మనోజ్‌ భార్య మౌనిక సీమంతం.. | Manchu Manoj Wife Mounika  Baby Shower In Nandyal - Sakshi

వీరిద్దరికి ఇది రెండో వివాహం. భూమ మౌనిక రెడ్డి గ‌తంలో ఓ వ్య‌క్తిని వివాహం చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే వీరిద్దరి మధ్యన మనస్పర్ధలతో విడిపోయారు. ఇక మనోజ్ కూడా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన రెండు సంవత్సరాలకి వీరిద్దరూ విడిపోయారు. ఇలా మనోజ్, మౌనిక ఇద్దరూ ఒంటరిగా ఉంటూనే ఒకరితో ఒకరు ప్రేమలో పడి పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరిద్దరు వివాహం తర్వాత హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్న ఈ జంట.. మరో కొద్ది రోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని మనోజ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. మౌనిక ప్రెగ్నెన్సీ గురించి ఎప్పటికప్పుడు అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నారు మనోజ్. ఇక తాజాగా మనోజ్ కవల పిల్లలకు తండ్రి అయ్యాడు అంటూ నెటింట పుకార్లు చెక్కర్లు కొట్టాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ మౌనిక ప్రస్తుత ఏడో నెల ప్రెగ్నెన్సీతో ఎంతో హెల్తీగా ఉందని.. ఎటువంటి రూమర్స్ వచ్చిన నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

Manchu Manoj and Mounika Shine In Black at Jio World Plaza Opening | Manchu  Manoj and Mounika Shine In Black at Jio World Plaza Opening

అలాగే ప్రస్తుతం ఏడో నెల ప్రెగ్నెన్సీ తో ఉన్న మౌనికకు ఘనంగా సాంప్రదాయ బద్దంగా నంద్యాలలో సీమంతం వేడుకలు జరిగాయి. నంద్యాల లోని తమ బంధువుల సమక్షంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటింట వైరల్ గా మారింది. ఇటీవల భూమా మౌనిక తండ్రి దివంగ‌త నేత భూమ నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా మనోజ్, మౌనిక నంద్యాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ దంపతులు ఆయనకు నివాళులు అర్పించారు. అదేవిధంగా నంద్యాల చేరుకున్న భూమా మౌనికకు తన కుటుంబ సభ్యులు సీమంతం వేడుకలు ఘనంగా జరిపారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఈ జంటకు జనం విషెస్ తెలియజేస్తున్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వవాలంటూ దీవిస్తున్నారు.