రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ రతిక.. అమ్మడి దశ తిరిగినట్లుందే..!!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటి షోగా బిగ్ బాస్ కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. అలా ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో ర‌తికా రోజ్ ఓ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. అద్భుతమైన అందంతో పాటు మంచి మంచి పాటలను పాడుతూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి తింగరి తనాన్ని ప్రూవ్ చేసుకుంది. ఆమె చేసే పనులతో నెటిజన్‌లలో విపరీతమైన నెగెటివిటీని దక్కించుకుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పై ఆమె వ్యవహరించిన తీరు పట్ల బయట ఆమెపై భారీగా నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది.

కానీ మళ్ళీ తిరిగి హౌస్‌లో రియంట్రి ఇచ్చి కాస్తయినా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందని అంతా భావించారు. అయితే రీ ఎంట్రీ లోను అదే నెగటివిటీతో బయటకు వచ్చింది. ఇక ఈ బ్యూటీ గతంలో పలు తెలుగు సినిమాల్లో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. కానీ బిగ్‌బాస్ తర్వాత ర‌తిక‌కు అసలైన గుర్తింపు వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రతికకు ప‌లు మూవీల‌లో మెయిన్ లీడ్ గా నటించే అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల్లో ర‌తిక‌కి హీరోయిన్గా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో వివరించింది.

Actress Rathika Rose (Bigg Boss Telugu 7) Age, Husband, Family, Movies  List, Biography, Wiki & More | Beautiful face images, Actresses, Celebrities

అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా హౌస్‌లో ఇత‌ర కంటెస్టెంట్లతో కలవని ఈ ముద్దుగుమ్మ.. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు ఎంతో కష్టపడుతుంది. తనకు సినిమాల్లో హీరోయిన్గా కొందరు ఛాన్స్ ఇచ్చారని.. ముఖ్యంగా తమిళంలో పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో హీరోయిన్గా అవకాశం వచ్చిందంటూ వివరించింది. అయితే దాన్ని వాళ్ళు అధికారికంగా ప్రకటించిన తరువాతనే తాను కూడా రివిల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ లో భారీ నెగెటివిటీ సంపాదించుకున్నా రతిక ఒక్కసారిగా రెండు సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.