అమ్మ బాబోయ్ .. నిహారిక ఆ హీరోతో రొమాన్స్ చేయబోతుందా ..? మెగా ఫ్యాన్స్ బూతుల వర్షం..!

నిహారిక ..మెగా డాటర్ గా అందరికీ సుపరిచితురాలు. జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ఆయనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు కూడా ఇచ్చేసింది . విడాకులు తీసుకున్నందుకు ఏమాత్రం బాధపడడం లేదు . “అందరూ మన అమ్మానాన్నల మనల్ని చూసుకుంటారు అని అనుకోవడం చాలా చాలా తప్పు అంటూ ఓ ఇంటర్వ్యూలో తన విడాకులకు సంబంధించిన విషయాన్ని బయట పెట్టేసింది “.

రీసెంట్గా నిహారిక తీసుకున్న నిర్ణయానికి సోషల్ మీడియా లో జనాలు సైతం ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . నిహారిక పంజా వైష్ణవ్తేజ్ తో సినిమా చేయబోతుందట . కొత్త దర్శకుడు వీళ్లిద్దరి కాంబోలో అద్దిరిపోయే లవ్ స్టోరీను డిజైన్ చేశారట. ఈ సినిమా ప్యూర్ లవ్ బేస్ తో తెరకెక్కుతుందట. రాధే శ్యామ్ సినిమా రేంజ్ లో ఈ సినిమా హిట్ అవ్వబోతుందని టాక్ కూడా వినిపిస్తుంది.

సోషల్ మీడియాలో సినీ వర్గాలలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయట . అసలకే విడాకుల తర్వాత నిహారికను ఎలా ట్రోల్ చేస్తున్నారో చూస్తున్నాం.. ఇలాంటి మూమెంట్లో ఇలాంటి సినిమా అవసరమా..? అంటూ మెగా ఫాన్స్ అయితే బూతుల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ విషయం ఇంతవరకు నిజమనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంపై అటు నిహారిక కానీ ఇటు పంజా వైష్ణవ్ తేజ్ కానీ స్పందించలేదు..!!