వార్నీ : బంగాళదుంప తొక్కలో కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. తెలిస్తే ఇక ఎప్పుడూ పడేయరూ..!!

బంగాళదుంప లో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలుసు. చిన్న పిల్లలకు కూడా బంగాళదుంపను ఆహారంగా ఇస్తూ ఉంటారు. అయితే బంగాళదుంప తొక్కులో కూడా పోషకాలు సమృద్ధిగా లభిస్తూ ఉంటాయట. అనేక వ్యాధులతో పోరాడే శక్తి ఈ తొక్కులలో ఉందని తెలుస్తుంది. ఇందులో పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ బంగాళదుంప పిల్‌లో హైపర్‌గ్లిజామిక్, కొలెస్ట్రాల్ లాంటి చెడు లక్షణాలను తగ్గించే గుణాలు ఉంటాయి. ఈ తొక్కులను తినడం ద్వారా అధిక కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించవచ్చని.. ఇందులోని పీచు పదార్థం ద్వారా మలబద్ధక సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు.

Vegan Potato Skin Chips - Your New Zero Waste Snack!

ఈ బంగాళదుంప పీల్ క్యాన్సర్ లాంటి ప్రమాదకర సమస్యల నుంచి శరీరాన్ని రక్షించడంలో ప్రభావం చూపుతుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోజనిక్‌యాసిడ్లు, ఫైటో కెమికల్స్ ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. బంగాళాదుంప పీల్స్ లో విటమిన్ బిసి, కెరిటనాయిడ్స్, జియాక్సంతీన్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, క్లోరోజనిక్ యాసిడ్స్, పొటాషియం.. కిడ్నీస్ స్టోన్ సమస్యలకు బాగా ఉపయోగపడతాయి. బంగాళదుంప తొక్కు తినడం వ‌ల్ల విటి ప్రభావం తగ్గుతుందట.

Crispy Potato Skins Recipe Top 3*** | Thomas Sixt Foodblog

అలాగే విట‌మిన్ బి 3 పుష్కలంగా లభిస్తుంది. ఇందులో క్యాల్షియం లాంటి ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు సహజంగా ఎముకలు బలోపేతం చేయడానికి సహకరిస్తాయి. ఎముకలను దృఢపరుస్తాయి. ఆలూ పై తొక్కలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఫినాలేక్ యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మంపై నల్ల మచ్చలను తొలగించి చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. రక్తపోటు నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బంగాళదుంపలు ఉపయోగపడతాయి. పై తొక్కలో ఉండే ఐరన్.. రక్తహీనతను నివారించడానికి తోడ్పడుతుంది.