మీకు బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందా.. అది ఎంత ప్రమాదమో తెలిస్తే తప్పక మానేస్తారు..

ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్ లో రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే స్ట్రెస్ బూస్టింగ్ కోసం బెడ్ కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కాఫీ తాగాకపోతే వీరు ఏదో కోల్పోయిన ఫీలింగ్ లో ఉంటూ ఉంటారు. అయితే కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్నది వాస్త‌వ‌మైనా.. పరగడుపున కాఫీ తాగితే మాత్రం ఎంతో ప్రమాదకరం. ఇంతకీ కాఫీ ఖాళీ కడుపుతో తాగితే ఎలాంటి నష్టాలు జరుగుతాయో.. తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటంటే ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ రిఫ్లెక్షన్ పెరుగుతుంది. కార్టీస్టాల్ స్థాయిలను పెంచి.. అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది.

Fresh & Romantic Morning Breakfast in Bed Free Stock Photo | picjumbo

కాఫీ శరీరంలో శక్తి స్థాయిలను ఇన్స్టెంట్‌గా పెంచుతుంది. కానీ కాళీ కడుపుతో కాఫీ తాగితే టెన్షన్, స్ట్రెస్, ఫియర్, ఎక్సైట్మెంట్ లాంటివి పెరిగిపోతాయి. వీటితో రోజువారి చేసే పనులకు డిస్ట్ర‌బెన్స్‌ జరుగుతుంది. అలాగే ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల విశ్రాంతి భంగం అవ్వడమే కాదు ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. కాఫీలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాళీ కడుపుతో ఉన్నప్పుడు పంపించడం వల్ల కడుపులో కెఫీన్ యాసిడ్స్ పెర‌గ‌డంతో బాడీలో ఇబ్బందులు కలుగుతాయి. దీంతో కడుపునొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిప్లెక్స్ ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

2,900+ Romantic Couple Having Coffee In Bed Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

ఇది రాను రాను అల్సర్ లాంటి తీవ్రమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. కాఫీలలో టాక్సిన్లు అనేక రకాల యాసిడ్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్, కాలుష్యం అబ్జర్స్‌ష‌న్‌ చేసే లక్షణాలను తగ్గిస్తుంది. దీంతో శరీరం అనారోగ్యానికి గురవుతుంది. టాక్సిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేసి.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు వివరించారు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. ఇలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే పరగడుపున కాఫీ తాగే అలవాటు మానుకోవడం మంచిది.