ప్చ్: మళ్లీ మోసం చేసిన ప్రభాస్.. రెబల్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ..రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే . సార్ ఒక్క మాట చెప్తే చాలు జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతూ ఆ పనులు చేసేస్తూ ఉంటారు . రీసెంట్గా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ సినిమాతో మంచి హిట్ ఇచ్చారు.

కాగా త్వరలోనే రిలీజ్ కాబోతున్న కల్కి సినిమా కూడా అంత పెద్ద హిట్ అవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. రీసెంట్గా కల్కి సినిమా విషయంలో ఓ న్యూస్ అభిమానులకు తీవ్ర హర్టింగా అనిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమాను పోస్ట్ పోన్ చేయాలి అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దానికి కారణం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగుతూ ఉండడమే .

నిజానికి ఏప్రిల్ 16వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ చాలా రకాల పోల్స్ ప్రకటించాయి. అయితే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేట్ ప్రకారం మే 13న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 9న కల్కి సినిమా రిలీజ్ చేస్తాము అంటూ ముందుగానే ప్రకటించేశారు మూవీ మేకర్స్ . ఈ క్రమంలోనే ఎలక్షన్స్ కి కరెక్టుగా నాలుగు రోజుల ఐదు రోజుల ముందు ఇలా సినిమా రిలీజ్ చేస్తే సినిమా మార్కెట్ దెబ్బతింటుంది అని ఆలోచించిన మేకర్స్ సినిమాని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీంతో రెబల్ ఫాన్స్ ఫుల్ డీలా పడిపోతున్నారు..!!