“నిన్నే పెళ్ళాడతా” సినిమాకి సీక్వెల్ వచ్చేస్తుందోచ్.. హీరో హీరోయిన్లు ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎన్నెన్ని కొత్త సినిమాలు వస్తున్నా సరే కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాలు తనవి తీరదు . ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి సినిమాలలో ఒకటి నిన్నే పెళ్ళాడతా. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున హీరోగా టబు హీరోయిన్గా నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . నాగార్జున కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి .

ఎన్నో మైల్ స్టోన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది . ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ ఫ్యాన్స్ చాలామంది కోరుకున్నారు. ఇన్నాళ్లకు ఆ టైం వచ్చింది అంటూ తెలుస్తుంది . ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోగా నాగచైతన్య ని చూస్ చేసుకున్నారట మేకర్స్. అంతేకాదు నాగచైతన్య కెరీర్ కి ఈ సినిమా మంచి టర్న్ బ్యాక్ అవుతుంది అంటున్నారు జనాలు .

అయితే ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ను చూస్ చేసుకోలేదట . కానీ అందరూ రష్మిక మందన్నా అయితే బాగుంటుంది అంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . చూద్దాం మరి దీనిపై మేకర్స్ ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇస్తారో. ప్రజెంట్ నాగచైతన్య తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా ఆయన కెరియర్ లో మంచి హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . రష్మిక మందన్నా టాలీవుడ్ లో మూడు బాలీవుడ్ లో నాలుగు సినిమాలతో బిజీగా దూసుకెళ్తుంది..!!