వాలెంటైన్స్ డే నాడు ఉపాసన ఏం చేసిందో చూశారా… మెగా కోడలు అన్నిట్లోనూ స్పెషలే..!

నేడు వాలెంటైన్స్ డే.. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు లవర్స్.. కపుల్స్.. ఫ్యామిలీ మెంబర్స్ . ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీస్ తమ వాలెంటైన్స్ డే ఎలా జరుపుకున్నాము అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫొటోస్ తో షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్గా మెగా కోడలు ఉపాసన షేర్ చేసుకున్న పిక్ అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఎవరైనా సరే వాలెంటైన్స్ డే అంటే లవర్ తో నో ..బాయ్ ఫ్రెండ్ తో నో.. భర్తత తోనో సెలబ్రేట్ చేసుకుంటారు .

కానీ ఉపాసనా మాత్రం చాలా డిఫరెంట్ ..ఆఫ్ కోర్స్ ఉపాసన అన్ని విషయాలలో డిఫరెంట్ . ఇప్పుడు వాలెంటైన్స్ డే ని కూడా చాలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత ఉపాసన రాంచరణ్ లకు క్లింకార పుట్టిన విషయం తెలిసిందే . ఈ బుజ్జి పాప రాకతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది . రీసెంట్ గా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్ తో స్పెషల్ ఫోటోలు పంచుకునింది ఉపాసన.

రాంచరణ్ – ఉపాసన – క్లింకార ఒకరి చేతిలో ఒకరి చేతులు వేసి ఉన్న క్యూట్ పిక్ ను షేర్ చేస్తూ లవ్ సింబల్ యాడ్ చేసి షేర్ చేసింది . ఈ ఫోటోపై హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది . ఉపాసన షేర్ చేసిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కేక మేడమ్.. మీరు..చరణ్ సార్..క్లింకార ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..!!