100 నక్క తోకలు తొక్కినంత అదృష్టాన్ని పట్టేసిన ప్రశాంత్ వర్మ .. ఏం లక్ రా బాబు నీది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ అభిమానులు . నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ వర్మ అంటే ఇండస్ట్రీలో పెద్దగా జనాలు గుర్తుపట్టే వాళ్ళు కాదు . ఏదో సినిమాలను తెరకెక్కిస్తాడు.. ఆయన సినిమాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంతే.. అంతవరకే అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే హనుమాన్ సినిమా రిలీజ్ అయిందో.. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందో ..అందరి స్టార్స్ కి నచ్చేసిందో.. ఒక్కసారిగా ఆయన పేరు మారు మ్రోగి పోవడం స్టార్ట్ అయింది .

ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్స్ లో రన్ అవుతుంది. దానికి కారణం ఆయన మైండ్ బ్లోయింగ్ డైరెక్షన్ . హనుమాన్ సినిమా తర్వాత జై హనుమాన్ సినిమాని కూడా అఫీషియల్ గా ప్రకటించేసాడు ప్రశాంత్ వర్మ . అయితే ఈ సినిమాలో హనుమంతుడి, రాముడి పాత్రలో స్టార్ హీరోలు నటించబోతున్నాడు అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది.

చాలా మంది చిరంజీవి – రామ్ చరణ్ – రానా లాంటి స్టార్ హీరోల పేర్లు ట్రెండ్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో పాన్ ఇండియా స్టార్ ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఒక్కొక్క భాషకు సంబంధించిన స్టార్ నటులు ఉంటే ..సినిమా మరింత రేంజ్ లో హిట్ అవుతుంది అంటూ ఆశపడుతున్నారట . అంతేకాదు యాష్ కూడా ఈ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడట . దీంతో లక్కీ ఛాన్స్ కొట్టేసాడు ప్రశాంత్ వర్మ అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇది నిజమైతే మాత్రం ఇక ప్రశాంత్ వర్మను ఎవరు ఆపలేరు..!!