ఆ పాట కోసం చచ్చి బ్రతికిన బన్నీ.. ఏ హీరో చేయని బిగ్గెస్ట్ రిస్క్ చేశాడుగా..!

బన్నీ భలే మొండోడు.. ఏదైనా చేస్తాడు .. మరి ముఖ్యంగా సినిమాల కోసమైతే ప్రాణం ఇచ్చేస్తాడు . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . సినిమాల కోసం ఎంతో కష్టపడి మరి డాన్స్ నేర్చుకొని తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడో అల్లు అర్జున్ . డాడీ సినిమా ద్వారా గెస్ట్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ .. గంగోత్రి సినిమా ద్వారా స్టార్ హీరోగా మారిపోయాడు . బన్నీతో స్టైలిష్ స్టార్ గా మారాడు మన అల్లు అర్జున్ . ఆ తర్వాత బన్నీ నటించిన సినిమాలు ఏ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేస్తాయో మనం చూసాం. అయితే బన్నీ నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఖచ్చితంగా అందులో ఏదో ఒక స్పెషల్ ధీమ్ అనేది ఉండనే ఉంటుంది .

మరీ ముఖ్యంగా బన్నీ కెరియర్ లో ఓ సినిమా చాలా ప్రత్యేకం . మరీ ముఖ్యంగా ఆ పాట కోసం చచ్చి బ్రతికాడు బన్నీ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. బన్నీ నటించిన సరైనోడు సినిమాలోని తెలుసా తెలుసా సాంగ్ ఆయనకు చాలా ప్రత్యేకంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఈ సినిమాలోని పాట కోసం ఎప్పుడూ ఎవరు చేయని సాహసం చేయాలి అనుకున్నారు. ఆ కారణంగానే అల్లు అరవింద్ కూడా ఎంత బడ్జెట్ అయినా పర్లేదు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు . ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏ ఇండియన్ ఫిలిం షూట్ చేయని లొకేషన్ చూస్ చేసుకున్నాడు బోయపాటి .

సౌత్ అమెరికాలోని బొలేవియా నుండి 50 గంటల జర్నీ చేస్తే కానీ ఈ ప్రదేశం మనకి రాదు . అంత సాల్ట్ ల్యాండ్ .. పొరపాటున కింద పడితే చర్మం తెగి ఊడిపోతుంది .. గట్టిగా మాట్లాడకూడదు తొందరగా పరిగెత్తకూడదు .. అడుగులో అడుగు వేయాలి .. అలాంటి లోకేషన్ కి వెళ్లి డైరెక్టర్ చిత్ర బృందం హీరో హీరోయిన్లు కష్టపడ్డారు . ఈ సినిమా చేసే టైంలో అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండిందట. ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా అనిపించిందట . కానీ అల్లు అర్జున్ – రకుల్ ప్రీత్ సింగ్ తమదైన స్టైల్ లో డాన్స్ చేసి అభిమానులను మెప్పించారు. అందుకే ఈ పాత్ర ఎప్పుడు ఆయనకు స్పెషల్ అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకు వస్తూ ఉంటారు..!!