అప్పుడు ఎన్టీఆర్ కి.. ఇప్పుడు చరణ్ కి.. ఊహించని షాక్ ఇచ్చిన స్టార్ సీనియర్ నటుడు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాను రిజెక్ట్ చేయడం చాలా సర్వసాధారణం కానీ దానికి ప్రాపర్ రీజన్ ఉండాలి . అయితే కొంతమంది నటీనటులు మాత్రం రీజన్ లేకపోయినా కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు . అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ సీనియర్ నటుడే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

ఆయన మరెవరో కాదు ఆర్ నారాయణ మూర్తి . ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరు. పలు సినిమాల్లో కూడా కీలకపాత్ర పోషించి మెప్పించారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో ఆయనను పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో చూపించడానికి పూరి జగన్నాథ్ బాగా కష్టపడ్డాడు. కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు . దీంతో ఆ రోల్ లో పోసాని కృష్ణమురళి గారికి వెళ్ళింది .

ఇప్పుడు ఎన్టీఆర్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం ఇంపార్టెంట్ పాత్రలో ఆర్.నారాయణమూర్తిని అనుకున్నారట బుచ్చిబాబు . అయితే ఆయన నో చెప్పడంతో ఫుల్ డిసప్పాయింట్ అయ్యారట . చరణ్ కూడా ఈ పాత్ర కోసం ఆయన అయితే బాగుంటుంది అంటూ ఆశపడ్డారట . కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో డీలా పడిపోయింది చిత్ర బృందం. ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!