పెళ్లి కాకుండానే తల్లి కావాలని ఆరాటపడుతున్న‌ నాగచైతన్య లవర్.. షాకింగ్ కామెంట్స్ వైరల్..

తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అడవి శేష్ గూఢాచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత మేజర్ మూవీ తో సక్సెస్ అందుకుని ఒక్కసారిగా పాపులర్ అయింది. అంతేకాదు ప్రస్తుతం తెలుగు, హిందీలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే ఇటీవల శోభిత దూళిపాళ్ల, నాగచైతన్య ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అంటూ ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ వార్తలు వైర‌ల్ అయ్యాయి. ఈ క్రమంలో చైతన్య, శోభిత హోటల్ లో కలిసి కనిపించడం కూడా ఈ వార్తలకు మరింత అరజ్యం పోసిన‌ట్లైంది. అయితే అలాంటి వార్తలపై వీరిద్దరూ స్పందించారు. అలాంటివేమీ లేవని క్లారిటీ ఇచ్చినా.. ఈ పుకార్లకు మాత్రం చెక్ పడలేదు.

Unseen pic of Naga Chaitanya and Sobhita Dhulipala from London vacay out.  Seen yet? - India Today

ఇక ఈ రూమర్లను పట్టించుకోకుండా శోభిత, చైతన్య ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ప్రస్తుతం శోభితా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటుంది. తొందరలో మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభితా తన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల‌ను చెప్పుకొచ్చింది. జీవితానికి ఒక లక్ష్యం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోను. కానీ మనం ఏం చేసినా ఆనందంగా ఉండాలి. నాకంటూ సాధించాల్సిన పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమీ లేవు. కొన్నిసార్లు నాకు తెలియకుండానే నేను మాతృత్వాన్ని కోరుకుంటా.. అదే నా జీవితానికి అసలైన అర్థం అని అప్పుడు అనిపిస్తుంది.

Sobhita Dhulipala desires of working with these two legendary actors

నిజంగా దాన్ని ఎప్పుడూ అనుభవిస్తానో కానీ.. అదొక అందమైన అద్భుతమైన ఫీలింగ్. అమ్మనవ్వడం.. అమ్మ అని పిలిపించుకోవడం.. చాలా బాగుంటుంది. దానిని మాటల్లో చెప్పలేం. అందుకోసమే నేను ఎదురు చూస్తున్న అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటివరకు వివాహమే చేసుకొని శోభితా ధూళిపాళ్ల మాతృత్వం పై ఎలాంటి కామెంట్స్ చేయడంతో.. నెట్టింట‌ ఈ కామెంట్స్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. పెళ్లికాకముందే తల్లి కావాలని ఆరాటపడుతున్నావా శోభిత అంటూ.. త్వరగా పెళ్లి చేసుకొని ఆ మాతృత్వాన్ని అనుభవించొచ్చు కదా అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.