సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ పై ఫైర్ అయినా చిన్నయి.. షాకింగ్ కామెంట్స్ వైరల్..

తెలుగు సింగర్ చిన్మ‌యికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గాత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న‌ ఈ ముద్దుగుమ్మ ఆడవాళ్లకు ఏదైనా అన్యాయం జరిగిందంటే అండగా ఉంటూ.. సోషల్ మీడియాలో గళం ఎత్తి వాదిస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చూస్తే తనదైన రీతిలో వారిపై విరుచుకుపడుతుంది. కాగా తాజాగా అలాంటి ఓ ఘటన విషయంలో ఫైర్ అయింది చిన్మయి. అయితే ఈసారి ఫైర్ అయ్యింది ఎవరి పైన కాదు మన టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ పై. ఆమె ఆడవారిపై చేసిన కామెంట్స్ ఆగౌరవపరిచినట్లు చిన్మయికి అనిపించడంతో ఆమెపై గళం ఎత్తింది. సీనియర్ నటి అన్నపూర్ణ ప్రస్తుతం బామ్మ పాత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆడవారిపై జరిగే హత్యాచారాల గురించి స్పందించింది.

Tollywood actress Annapurna's daughter commits suicide | Telugu Movie News - Times of India

ఆమె మాట్లాడుతూ అర్ధరాత్రి 12 గం.. స్వతంత్ర అనగానే అప్పట్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్ళా.. ఆడదానికి అసలు ఎందుకు స్వతంత్రం కావాలి.. రాత్రి 12 గంటల తర్వాత బయటకు వచ్చే పనేంటి.. ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైంది.. ఎవరు మనల్ని ఏమీ అనొద్దు అనుకుంటూనే.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేలా మనమే రెడీ అవుతున్నాం. ఇప్పుడు ఎదుటి వాళ్ళది తప్పు అనడంలో న్యాయం లేదు. మన వైపు కూడా కొంచెం ఉంటుంది అంటూ ఆమె మాట్లాడింది. ఈ వీడియో పై సింగర్ చిన్మయి ఫైర్ అయింది. తనకు నచ్చిన ఓ యాక్టర్ ఇలా మాట్లాడుతుంటే హార్ట్ బ్రేక్ అయినట్లు అనిపిస్తుంది. ఆమె చెప్పినట్లుగా ఉంటే అర్ధరాత్రి ఎమర్జెన్సీ జరగకూడదు.. ఏ హాస్పిటల్లో అర్ధ‌రాత్రి లేడీ నర్సులు, డాక్టర్లు ఉండకూడదు. ఆరు తర్వాత ఎవరు హాస్పిటల్లో ఉన్నా.. కేవలం మ‌గ నర్సులు, డాక్టర్స్ మాత్రమే ఉండాలి అంటూ వివ‌రించింది.

For a cause

ఆడవారికి ఏదైనా ప్రమాదం జరిగిన సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే జరగాలి. అర్ధరాత్రి జరిగితే అమ్మాయిలను హాస్పిటల్కి తీసుకెళ్లకూడదు.. ఇంట్లోనే ఉంచేయాలి. ఆవిడ చెప్పినట్లే వినడం అయితే గైనకాలజిస్ట్ లు కూడా ఆడవారే ఉంటారు.. కాబట్టి పిల్లలు కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం సమయంలోపే పుట్టాలి, ఎందుకంటే అర్ధరాత్రి హాస్పిటల్స్ లో లేడీ గైనకాలజిస్ట్‌లు ఉండకూడదు కాబట్టి అంటూ వివరించింది. ఇంట్లో వాష్రూమ్ లేక సూర్యోదయానికి ముందే ఉద‌యం 3 గంటలకు లేచి పొలం గట్లకు వెళ్తున్న ఆడవాళ్లు ఇప్పటికీ ఉంటున్నారు. అమ్మాయిల వేషధారణ వల్లనే అగాయిత్యాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడం మనం చేసుకున్న పాపం అంటూ ఆమె ఫైర్ అయింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)