తమన్నా పేరు మార్చుకోవడానికి కారణం అదేనా.. అసలు సీక్రెట్ రియల్ చేసిన మిల్కీ బ్యూటీ..

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ వరుస సినిమా ఆఫర్లను తగ్గించుకుంటూ బిజీగా గడుపుతుంది. మరో పక్కన బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అసలు పేరు తమన్నా కాదట కొన్ని కారణాలతో తన పేరును మార్చుకుందని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించింది. ఇంతకీ ఆమె అసలు పేరు ఏంటి.. పేరు మార్చుకోవడానికి కారణం ఏంటి.. అనే విషయాలు తెలుసుకుందాం.

Tamanna Exclusive Interview

తమన్నా అంటే అర్థం హిందీలో కోరిక అని. 8, 9 ఏళ్ళ‌ వయస్సులోనే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదగాలని కలలు కంటూ ఉండేది. అనుకున్నట్టుగానే టీనేజ్ వచ్చేసరికి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అక్క‌డ స‌క్స‌స్ అయి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెడదాం అని భావించిన తమన్నకు ఒక ఆయన కలిసాడట. పేరులో మార్పు చేసుకోమని.. మీకు క‌లిసొస్తుంద‌ని వివ‌రించాడ‌ట‌.

Tamannaah Bhatia : r/TamannaBhatia

అలా ఆ వ్య‌క్తి చెప్పడం.. ఇంగ్లీష్ లో త‌న పేరు ఆధారంగా a,h అక్ష‌రాల‌ను జోడించమ‌ని సలహా ఇవ్వడం జరిగిందట‌. అయితే అలా thamana పేరును thamanaah గా మార్చుకుందుట ఈ ముద్దుగుమ్మ‌. అయితే తమన్నా కూడా ఇలాంటివి బాగా నమ్ముతుంది ఈ పేరు మార్పు అనేది తనలో చాలా పాజిటివ్ ఫీలింగ్ తెచ్చిందని.. కెరీర్ పరంగా బాగా కలిసి వచ్చిందని తమన్నా ఆ ఇంటర్వ్యూలో వివరించింది. ప్ర‌స్తుతం త‌మ‌న్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ కావ‌డంతో త‌మ‌న్న ఇలాంటివి న‌మ్ముతుందా అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.