ఈ ఫోటోలో ఉన్న నలుగురు అక్క చెల్లెళ్ళను గుర్తుపట్టారా.. అందరూ మెగా స్టార్‌తో న‌టించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్స్..

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల లైఫ్ స్పాన్ కంటే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు 60 ఏళ్ళు వచ్చిన ఇంకా సీనియర్ హీరోలుగా దూసుకుపోతూనే ఉంటారు. హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 5 ఏళ్ళు మహా అయితే 10,15 ఏళ్లలోపే లైమ్‌లైట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అయితే వీళ్ళందరి కంటే అతిలోకసుందరి శ్రీదేవి మాత్రం చాలా భిన్నం. దాదాపు రెండున్నర దశాబ్దాలు అలుపెరగకుండా వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ప్రస్తుత కాలంలో పాన్ ఇండియా హీరోలు ఉంటున్నారు.

Jagadeka Veerudu Athiloka Sundari | Cinema Chaat

కానీ అప్పట్లో శ్రీదేవి.. అన్ని ఇండస్ట్రీలో నటించి పాన్ ఇండియన్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక సౌత్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న శ్రీదేవి.. చెల్లెల్లు కూడా ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు. అయితే వీరందరూ కూడా చిరంజీవితో కలిసి సినిమాలో నటించారు. శ్రీదేవి కజిన్‌ సిస్టర్లలో మొదట ఇండస్ట్రీలోకి వచ్చింది నగ్మా. 1990లో సల్మాన్ తో కలిసి భాగి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తర్వాత ఏడాది సుమన్, మోహన్ బాబు నటించిన పెద్దింటి అల్లుడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

Master (1997 film) - Wikipedia

ఆ తర్వాత జ్యోతిక.. అక్షయ్ కన్నాతో కలిసి డోలీ స‌జాకే ర‌క్నా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఠాగూర్, షాక్, మాస్ లాంటి తెలుగు సినిమాల‌లో నటించింది. ఇక శ్రీదేవి చిన్న చెల్లి రోషిని.. శిస్య‌ తమిళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో ఈ బ్యూటీ మాస్టర్ సినిమాలో నటించింది. ఇలా ఈ నలుగురు అక్కచెల్లెళ్ళు మెగాస్టార్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకోవడం విశేషం.అయితే వీరు అందరిలో ముందుగా శ్రీదేవి మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన ” జగదేకవీరుడు అతిలోకసుందరి ‘ అప్పట్లో బాక్సా ఆఫీస్ వద్ద సంచ‌ల‌నం సృష్టించిన సంగతి తెలిసిందే.

28 Years for Gharana Mogudu: 4 fascinating things about the Chiranjeevi  starrer | The Times of India

ఇది ఎవర్గ్రీన్ కల్ట్ క్లాసికల్ మూవీగా నిలిచిపోయింది. ఆ తర్వాత నగ్మా ” ఘరానా మొగుడు ” సినిమాలో చిరుతో కలిసి నటించింది. ఇక చిన్న చెల్లెలు రోషిని ” మాస్టర్ ” సినిమాతో మెగాస్టార్‌తో మెప్పించింది. కమర్షియల్ గా సినిమా డిజాస్టర్ కావడంతో ఈమె పేరు పెద్దగా వినిపించలేదు. చివరిగా జ్యోతిక ” ఠాగూర్ ” సినిమాలో చిరుత నటించి ఈ సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కానీ సెకండ్ హీరోయిన్ కావ‌డంతో తెలుగులో ఊహించిన రేంజ్‌లో ఆఫ‌ర్స్‌ రాలేదు. ఇలా శ్రీదేవి , చెల్లెలు నలుగురు చిరంజీవితో కలిసి సినిమాలో నటించారు. స్టార్ హీరోయిన్స్ గా ఒకప్పుడు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

Watch Tagore (Telugu) Full Movie Online | Sun NXT