పూరి ప్రేమ పెళ్లికి చెయ్యందించిన టాప్ యాంకర్ ఎవరో తెలుసా..?

ట్రెండింగ్ సినిమాలను వెలుగులోకి తీసుకురావడం.. చిన్న హీరోలను స్టార్ హీరోలు చేయడం ఒక్క పూరికే సాధ్యం అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. తన డైరెక్షన్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించాడు పూరి. ఇక పవన్ కు బద్రి వంటి సూపర్ హిట్ సినిమాలు అందించాడు కూడా.

ఒక పవన్ కి అనే కాకుండా ఇతర హీరోలకి సైతం మంచి సక్సెస్ ని అందించాడు పూరి. ఇక రవితేజ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా పూరినే. ఇలా చెప్పుకుంటూ పోతే పూరి చరిత్రలో వందల మంది హీరోలు ఉంటారు. ఇక పూరి జగన్నాథ్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఈయ‌నది ప్రేమ పెళ్లి అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా ఉన్నప్పటికీ గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.

ముఖ్యంగా సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో పూరి ఎన్నో కష్టాలు అనుభవించినట్లు తెలియజేశాడు కూడా. తన పెళ్లి సమయంలో ఎక్కువ కష్టాలు పడినట్లు పూరీ గతంలో వెల్లడించాడు. తాను వివాహం చేసుకున్న సమయంలో తన చేతిలో రూపాయి లేదని వాపోయాడు. తాళిబొట్టు కొనేందుకు కూడా తన వద్ద డబ్బులు లేని పరిస్థితుల్లో యాంకర్ జాన్నీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అదేవిధంగా నటి హేమ కూడా తనకు బట్టలు కొనిపెట్టారని పూరి చెప్పుకొచ్చాడు. ఇలా పూరి ప్రేమ పెళ్లికి వీరిద్దరూ సహాయం చేశారు.