పై ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న స్టార్ సెలబ్రిటీస్ అందరికీ దాదాపు అభిమానులు ఉంటారు. వారికి సంబంధించిన ఫేవరెట్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫోటోలు, లేదా పర్సనల్ విషయాలు, మరి ఏదైనా సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా గత కొంతకాలంగా సెలబ్రెటీస్ చిన్ననాటి ఫొటోస్ త్రో బ్యాక్ థీంతో వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ యంగ్ ఏజ్‌లో త‌న భార్య‌తో ఉన్న ఫోటో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా?

Director Sukumar wife Thabitha into... - Celebrity Couple | Facebook

అయ‌న.. అల్లు అర్జున్, నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు తెరకెక్కించి హీట్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ లో కూడా కనిపించి మెప్పించాడు. గతేడాది నిర్మాతగా మారి ఓ హారర్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది అల్లు అర్జున్ తో భారీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఇప్పటికైనా ఈ స్టార్ట్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా.. ఎస్ మీరు గెస్ చేసింది కరెక్టే. ఆ సిక్ సుకుమార్ త‌న భార్య త‌భితాదే. తాజాగా సుకుమార్ భార్య త‌భితా సోషల్ మీడియాలో ఈ ఫోటో షేర్ చేసుకుంది. 2004లో దిగిన ఈ ఫోటోతో పాటు ఈ ఏడాదిలో దిగిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె షేర్ చేసుకుంది.

నీ ప్రేమను పొందడం నా అదృష్టం.. ఇది ఎంతో మధురం అంటూ రాసుకొచ్చింది. దీనికి 20 ఏళ్ల ప్రయాణం అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించింది. అయితే అప్పటికి.. ఇప్పుడున్న సుకుమార్ కు అసలు పోలికే లేదు. ఈ రెండు ఫోటోలు లోనూ అసలు సుకుమార్ గుర్తుపట్టలేనంతగా మార్పులు కనిపించడంతో వాటే చేంజ్ అంటూ.. ఇంత మార్పు ఎలా వచ్చింది సుకుమార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక చివ‌రిగా సుకుమార్‌ నిర్మించిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని.. పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్పా 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలన్నాయి. ఈ సినిమాతో మరోసారి బన్నీ, సుకుమార్ కొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.