కృష్ణ వదిలేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చిరు.. ఏ మూవీ అంటే..!

ఒకప్పటి స్టార్ హీరోలు అయినా కృష్ణ మరియు చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ‌. తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరు తమ ఖాతాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను వేసుకున్నారు. ఇక ప్రస్తుత కాలంలో కూడా చిరంజీవి ఇండస్ట్రీలో కొనసాగుతుంటే కృష్ణ గారు మన మధ్య లేరు.

ఇక తాజాగా వీరిద్దరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కృష్ణ వదిలేసిన సినిమాని చిరు చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడట. ఆ సినిమా మరేదో కాదు ఖైదీ. 1983 లో డైరెక్టర్ కోదండ రామిరెడ్డి హీరో కృష్ణకు ఖైదీ సినిమా కథను వెల్లడించారు. అప్పటికే కృష్ణ ఫుల్ బిజీగా ఉండడంతో ఆ సినిమాకి నో చెప్పాడట.

కృష్ణ కోసం కొన్ని నెలలు వెయిట్ చేసిన కోదండ తరువాత అదే కథను చిరంజీవికి వినిపించాడట. ఆ సమయంలో చిరు కథ నచ్చడంతో ఓకే చెప్పాడట. అలా కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు చిరు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో ఉన్న చిరు ఖాతాలో విశ్వంభరా హిట్ పడితే మరికొన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.