చిరంజీవి చెప్పడం వల్లే శ్రీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేందర్రావు అప్పట్లో తెరకెక్కించిన సినిమాలన్నీ సంచలనం సృష్టించిన‌ సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీ హీట్లను కొట్టడమే కాదు.. టాలీవుడ్ దర్శకేంద్రుడిగా భారీపాపులారిటీ దక్కించుకున్నాడు. ఎంతోమంది హీరోల కెరీర్ లో ది బెస్ట్ సినిమాలను అందించాడు. ముఖ్యంగా బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో చాలలా సినిమాలను తెర‌కెక్కించాడు. సీనియర్ ఎన్టీఆర్ తో కూడా చాలా సినిమాలు రూపొందించి విజయాలను అందుకున్న రాఘవేంద్రరావు.. ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయాలనుకుని పెళ్లి సందడి సినిమా స్టోరీ ని సెలెక్ట్ చేసుకున్నాడట.

Pelli Sandadi (1996) - IMDb

ఈ సినిమాకు పెద్ద హీరోలు కాకుండా చిన్న హీరో అయితే బాగా సెట్ అవుతాడనే ఉద్దేశంతో ఒక మిడిల్ రేంజ్ హీరోని వెతకడం ప్రారంభించాడట. అయితే ఒక రోజు అనుకోకుండా చిరంజీవిని కలిస్తే ఆయనకు ఈ కథని చెప్పి మిడిల్ రేంజ్ హీరో అయితే దీనికి సెట్ అవుతాడని భావిస్తున్న అనగానే.. చిరంజీవి వెంటనే ఈ సినిమా శ్రీకాంత్‌తో చేస్తే చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడట రాఘవేంద్రరావు కూడా ఈ ఆలోచన సరిగ్గా ఉందని శ్రీకాంత్ హీరోగా ఫిక్స్ అయ్యాడట. ఇక శ్రీకాంత్ కి కథ చెప్పడం. క‌థ న‌చ్చి హీరోగా ఈ సినిమాను రూపొందించడం సినిమా సూపర్ సక్సెస్ సాధించడం అన్నీ వరుసగా జరిగిపోయాయి.

Roshan Meka's Pelli SandaD To Stream On This OTT Platform From June 24 -  News18

శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా ఈ సినిమా నిలిచింది. అలాగే డైరెక్టర్ రాఘవేంద్రరావు కెరీర్ లో కూడా ది బెస్ట్ సినిమా ఇదే. శ్రీకాంత్ కు ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోయాడు. అంతేకాదు శ్రీకాంత్ కొడుకు రోష‌న్‌ను కూడా మళ్లీ రాఘవేంద్రరావు ఏ ఇదే టైటిల్ తో సినిమా తెరకెక్కించి ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ‌లీల‌కు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.