ఓ మై గాడ్.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ నే మించిపోతున్న నాని.. సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని మొదట ఆర్‌జేగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి మెల్లమెల్లగా హీరోగా టర్న్ అయ్యాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోగా క్రేజ్ సంపాదించుకున్న డార్లింగ్.. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ లిస్టులో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోల్లో ఎవరికీ సాధ్యం కానీ విధంగా బిజీ లైన‌ప్‌ సిద్ధం చేసుకున్నాడు. ఇక‌ నాని లైఫ్ టర్న్ చేసిన మూవి దసరా. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్ లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. అంతకు ముందు వరకు ఒకే స్థానంలో ఉంటూ స్ట్రగుల్ అవుతున్న నానికి ఈ సినిమా భారీ సక్సెస్ అందించి.. సుమారు రూ.100 కోట్లు కలెక్షన్లను రాబట్టింది.

ఈ సినిమాతో నాని మార్కెట్ పాన్ ఇండియా వరకు ఎదిగింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన హాయ్ నాన్నకి నెగటివ్ టాక్ వచ్చినా.. దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టి హిట్‌గా మారింది. నానికి ఉన్న పాన్‌ ఇండియా లెవెల్ మార్కెట్ దీనికి కారణమని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలు అన్ని వేరే లెవెల్ లో ఉంటున్నాయి. తాజాగా ఆయన పుట్టినరోజు స్పెషల్ గా సరిపోదా శనివారం మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్‌లో నాని మాస్.. మరో రేంజ్ లో ఆకట్టుకుంది. క్లాస్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ మూవీ ఆగస్టు చివరిలో ప్రేక్షకుల‌ముందుకు రానుంది.

ఇక తర్వాత సినిమాల లైన‌ప్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ప్రస్తుతం నాని లైన్ లో ఐదు సినిమాలు ఉన్నాయి. అవి ఏంటంటే ప్రస్తుతం వివేకాత్రేయతో తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. అలాగే ఓజీ ఫేమ్‌ సుజిత్ తో ఒక సినిమా ప్రకటించాడు. నాని 32 గా ఈ మూవీ తెరకెక్క‌నుంది. పవన్ ఓజీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నానితో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. అలాగే బలగం ఫేమ్ వేణు ఎల్లంది తో ఒక సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ అనుకుంటున్నారట మేకర్స్. ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్‌. కాగా నాని పుట్టినరోజు సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి నానికి విష్ తెలియజేశారు. ఆ పిక్స్ నిట్టింట‌ వైరల్ గా మారాయి. అలాగే నాని కెరీర్ కు మైల్డ్‌ స్టోన్‌గా నిలిచ్చిన దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ వడ్డెలతో మరో సినిమాకు కమిటీ అయినట్టు తెలుస్తుంది.

శ్రీకాంత్ కూడా ఇప్పటివరకు కొత్త సినిమాలు ప్రకటించకపోవడంతో వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుందంటే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాని త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమిళ్ డైరెక్టర్లు కూడా నానితో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారట‌. కార్తీక్ సుబ్బరాజు, శిబి చక్రవర్తి లాంటి వారు నానితో డిస్కషన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇవన్నీ చూస్తుంటే నాని కమిట్ అయిన సినిమాలే ఐదు ఉండగా మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా మొత్తం 8 సినిమాలను దాదాపు లైన్ అప్ లో పెట్టుకున్న నాని రెండు మూడేళ్ల వరకు బిజినెస్ షెడ్యూల్ గడుపుతాడు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి వారి చేతిలోనే నాలుగు నుంచి ఆరు సినిమాలు వరకు ఉండగా నానికి ఏకంగా 8 సినిమాలు లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది.