మహేశ్ బాబు ను తొక్కేయడానికి వెనుక కుట్ర జరుగుతుందా..? రోడ్డు పైకి లాగాలి అని చూస్తుంది ఆ పెద్ద మనిషేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. చాలామంది మహేష్ బాబు అభిమానులు ఈ మధ్యకాలంలో ఇవే కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొని మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు . పచ్చి బూతులతో ఆయనను ట్రోల్ చేశారు . అవి పెద్దగా పట్టించుకోని మహేష్ బాబు – రాజమౌళి సినిమా షూట్ లో బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు .

కాగా రీసెంట్గా మహేష్ బాబుకు సంబంధించిన మరొక విషయం నెట్టింట వైరల్ గా మారింది . మహేష్ బాబు గతంలో నటించిన మహర్షి సినిమా కూడా కాపీ రైట్ వివాదాన్ని ఎదుర్కోబోతోంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా కాపీరైట్ వివాదాన్ని ఎదుర్కొంటుంది . శరత్ చంద్ర.. ఈ కథ నాది అంటూ కోర్టుకు ఎక్కారు. ఈ విషయం ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది . అయితే ఆ కేస్ పూర్తవ్వకముందే మరో విషయం బయటపడడం ఇప్పుడు మహేష్ అభిమానులకు మింగుడు పడడం లేదు.

రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్ చంద్ర.. మహర్షి కథ కూడా నాదేనని నేను రాసిన నవల ఆధారంగా ఈ కథను తెరకెక్కించారు అని .. శ్రీమంతుడు వివాదం పూర్తవ్వగానే మళ్లీ నా హక్కుల కోసం కోర్టుకు వెళ్తాను అని చెప్పుకొచ్చారు . దీంతో మహేష్ బాబు అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. బ్యాక్ టు బ్యాక్ ఎందుకు మహేష్ బాబు కి ఇలాంటివి జరుగుతున్నాయి. దీని వెనక ఎవరో హీరో హస్తం ఉంది ..లేకపోతే ఏ అండ చూసుకోకుండా ఇలా ఎవరూ చేయరు ..? అంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు వంశీ పైడిపల్లి ..నిర్మాత దిల్ రాజు ..హీరో మహేష్ బాబు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది..!!