లక్ అంటే కృతి శెట్టిదే.. దారిన పోయ్యే దరిద్రాని కూడా అదృష్టంగా మార్చుకునేసిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . దారిన పోయే దరిద్రాన్ని కూడా కృటిశెట్టి అదృష్టంగా మార్చేసుకుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. కృతి శెట్టి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలోకి ఉప్పెన అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది . అయితే బాగా దిష్టి తగిలిపోయినట్లుంది .

ఆ తర్వాత నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి . దీంతో తెలుగు జనాలు అమ్మడం దూరం పెట్టేశారు . అయితే కోలీవుడ్ లో మాత్రం మంచిగా ఆఫర్స్ రాబట్టుకునింది . అక్కడ వచ్చిన పబ్లిసిటీ పాపులారిటీతో మళ్ళీ తెలుగులో సినిమాలు అందుకోవడం స్టార్ట్ చేసింది . రీసెంట్గా కోలీవుడ్లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది .

ఈ సినిమాలో నయనతార హీరోకి అక్క పాత్రలో నటించాల్సింది. అయితే కొన్ని కారణాల చేత ఆమె తప్పు కుందట. దీంతో కృతి శెట్టికి బాగా కలిసి వచ్చింది . నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఆ సినిమాలో ఉంటే కృతి శెట్టి ది బిస్కెట్ క్యారెక్టర్ అయిపోయేది. ఫైనల్లీ నయనతార తప్పుకోవడంతో కృతి శెట్టికి అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఆ పాత్రలో వేరే ఏ హీరోయిన్ నటించిన ఆ రేంజ్ లో అందాలైతే ఆరబోయలేదు ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ ఇస్తుంది అంటున్నారు అభిమానులు . ఇలా దరిద్రాన్ని కూడా అదృష్టంగా మార్చుకునేసింది కృతి శెట్టి అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!