అప్పుడు అకిరా కోసం పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు అర్జున్ కోసం నాని.. గ్రేట్ ఫాదర్స్ రా వీళ్లు .!!

నాన్న .. ఈ పేరు చెప్తేనే.. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్. వచ్చేస్తాయి ఆఫ్ కోర్స్ తల్లి మనకి జన్మనిస్తుంది .. కానీ తండ్రి జీవితాంతం సరిపడే మెలకువలను నేర్పిస్తూ ఉంటాడు . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని పేరు మారు మ్రోగిపోతుంది. నాని వివాదాలకు దూరంగా ఉంటాడు. కాంట్రవరషియల్ కంటెంట్ జోలికి అస్సలు వెళ్లడు . హ్యాపీగా పీస్ ఫుల్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాగా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసే నాని రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా తన కొడుకు పియానో ప్లే చేస్తున్న వీడియోని షేర్ చేసి మురిసిపోయాడు.

ఇప్పుడు పవన్ అభిమానులు కూడా ఈ వీడియో పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . ఎందుకంటే స్టార్ హీరో కొడుకు స్టార్ హీరోనే అవ్వాలి అంటూ చాలామంది వాళ్లపై బలవంతంగా ఆ ఆశలను రుద్దుతూ ఉంటారు . అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ అకీరా విషయంలో అలా చేయలేదు. తనకు నచ్చిన విధంగా ఉండమంటూ ఎంకరేజ్ చేశారు . అందుకే ఆకీరాకి ఎంతో ఇష్టమైన మ్యూజిక్ ని నేర్చుకోమంటూ సపోర్ట్ చేశారు .

రీసెంట్గా మెగా సెలబ్రేషన్స్ లో అకిరా పియానో ప్లే చేయడం మనం చూసాం . కాగా ఇప్పుడు అకిరాను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న నాని కొడుకు అర్జున్ కూడా పియానో నేర్చుకుంటున్నాడు. ఏడేళ్ల వయసులోనే ఇంత చక్కగా పియానో వాయించేస్తున్నాడు అంటూ పవన్ అభిమానులు – నాని అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . వీళ్ళు నిజంగా గ్రేట్ ఫాదర్స్ రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ నాని కొడుకు అర్జున్ పియానో వాయిస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)