బిగ్ బ్రేకింగ్: రామ్ చరణ్ భార్య ఉపాసన సంచలన ప్రకటన..మెగా ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!!

ఇది నిజంగా మెగా అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి . మెగా కోడలు ఉపాసన రీసెంట్గా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు . ఇప్పటికే అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను ఉపాసన చూసుకుంటుంది . కాగా రీసెంట్గా ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ లో తన తాతగారు కెరియర్ లో ఎదిగిన విధానాన్ని “దీ అపోలో స్టోరీ” అంటూ ఓ పుస్తకాన్ని లాంచ్ చేశారు .

అనంతరం ఉపాసన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన తాతయ్య గురించి ఆయన గొప్పతనం గురించి వివరించారు . తన తాతయ్య తన కూతుర్లలో ఎలాస్ఫూర్తిని నింపారో చెప్పుకొచ్చారు . ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి చదవాలి అంటూ కోరారు . అంతేకాదు ఇదే క్రమంలో బయోపిక్ ఏమైనా తీసే ఆలోచనలు ఉన్నాయా..? అంటూ మీడియా అడగ్గా..” ఆవును కచ్చితంగా భవిష్యత్తులో అది జరగొచ్చు” అంటూ తెలిపింది.

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు రాం చరన్ అందులో నటిస్తాడా..? అని అడగ్గా.. అది డైరెక్టర్ విజన్ బట్టి ఉంటుంది అంటూ సమాధానం దాటవేసింది. ఈ క్రమంలోనే ఉపాసన తన తాతయ్య బయోపిక్ అనౌన్స్ చేయడం పట్ల మెగా ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. ఉపాసనకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు అంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది . అయిన తన తాతయ్య బయోపిక్ ను తెరకెక్కిస్తాను అంటూ ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. చాలామంది ఉపాసన నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు..!!