విశ్వంభరలో మీనాక్షి చౌదరి.. ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలిస్తే నోరెళ‌బెడ‌తారు..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి గ‌త‌ కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇచ్చ‌ట‌ వాహనాలు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. కానీ నటనకు, లుక్స్ కి మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వెంటనే ఆమెకు రవితేజ ఖిలాడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. కానీ తర్వాత ఈమె నటించిన హిట్ సినిమాతో డీసెంట్ హిట్ తన ఖాతాలో పడింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజైన‌ గుంటూరు కారం సినిమాలో కీరోల్‌లో నటించింది.

ఈ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా.. హీరోయిన్గా ఈమెకు మరిన్ని ఛాన్సులు తెచ్చి పెట్టడంలో గుంటూరు కారం కీలకపాత్ర వహించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ లో హీరోయిన్గా నటిస్తోంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ, గౌతమ్ తిననూరి కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమాకు కూడా హీరోయిన్గా సెలెక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో మీనాక్షి నటిస్తుందట.

వాస్తవానికి ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కానీ ఈ సినిమాలో దేవకన్య పాత్రలో మీనాక్షి నటించబోతుందని తెలుస్తుంది. అంటే ప్రధాన పాత్ర కాదు కానీ ఆమెది కూడా ఓ కీలక పాత్ర అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. గతంలో శ్రీదేవి దేవకన్య పాత్రలో మెప్పించింది.. ఇప్పుడు మీనాక్షి ఆ రేంజ్ లో నటించగలదో లేదో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.