మూడోసారి రీ రిలీజ్ అయిన సాయి పల్లవి హిట్ మూవీ.. భారీ లెవెల్ లో కలెక్షన్స్..

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మొదట మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్ లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో దూసుకుపోతుంది. తన న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. కాగా మలయాళం కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ప్రేమమ్ లో.. సాయి పల్లవి తో పాటు అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా మరో కీలక పాత్రలో నటించింది.

ఇక ఈ సినిమా ఫిబ్రవరి 1న కేరళ, తమిళనాడుల‌లో మరోసారి రీరిలీజ్ కాగా థియేట‌ర్స్‌లో అదిరిపోయే కలెక్షన్లు దక్కించుకుంటుంది. రెండు చోట్ల ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. ఐదు రోజుల్లోనే రెండు కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ్ళ‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా తమిళ, మలయాళ‌ సినిమాల్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దూసుకుపోతుంది. ఇక ఇటీవల రీ రిలీజ్ అవుతున్న సినిమాలు రెండు లేదా మూడు రోజుల్లోనే థియేటర్ల నుంచి తప్పుకుంటున్నాయి. అలాంటి క్రమంలో ప్రమ‌మ్‌ రిలీజై అయిదు రోజులు అయినా కూడా చెన్నైలోని చాలా థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.

దీంతో చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటూ ఈ విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట‌ వైరల్ అయింది. ఇక ఆ ప్రాంతాల్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో ప్రేమమ్‌కు ఇది మ‌రింత ప్లస్ అయిందని టాక్. అయితే ఇది మొదట 2016లో వాలెంటెన్స్ డే సందర్భంగా తమిళ్లో రిలీజ్ అయింది. అలాగే 2017లో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల రీ రిలీజ్ అయిన ఈ సినిమా మూడోసారి ధియేటర్లలో సందడి చేస్తుంది.