‘ హనుమాన్ ‘ మూవీ కోసం తేజా స‌జ్జా అంత పెద్ద‌ త్యాగం చేశాడా.. అందుకే అంత మంచి స‌క్స‌స్ వ‌చ్చిందా..?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ ఇటీవల హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ ఎంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన ఈ సినిమా 2024 సంక్రాంతి బ‌రిలో స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి మంచి సక్సెస్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాతో తేజ సజ్జ‌కు కూడా తిరుగులేని పాపులారిటీ దక్కింది. ఈ నేపథ్యంలో పలు ఛానల్లో ఇంటర్వ్యూలో తేజ సజ్జ సందడి చేస్తున్నాడు.

ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఎవరికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివిల్ చేశాడు తేజ. హనుమాన్ సినిమా కోసం చేసిన త్యాగాన్ని వివరించాడు. హనుమాన్ మూవీ టైంలో తేజకు 70 నుంచి 75 సినిమాలు ఆఫర్లు వచ్చాయని.. అందులో 15 సినిమాలు మాత్రం డీసెంట్ కథ‌లని వివరించాడు. ఇక హనుమాన్ సినిమా కోసం వాటన్నింటినీ వదులుకున్నానని చెప్పుకొచ్చాడు తేజ. ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియకపోయినా హనుమాన్ కోసం తేజ చేసిన గొప్ప త్యాగం ఫలించిందని..

ఆ కార‌ణంతోనే హనుమాన్ రూపంలో అంత మంచి ఫలితం దక్కిందని నెటిజ‌న్‌లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక హనుమాన్ సినిమాతో తేజ కెరీర్ మలుపు తిరగడమే కాదు.. ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాలో నటించాడు అంటూ తేజను ప్రశంసిస్తున్నారు జ‌నం. ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వల్‌గా జై హనుమాన్ రానున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ తేజ కనిపిస్తాడ‌ని ప్ర‌శాంత్ విరించాడు.