స్ప్రింగ్ లా బాడీని తిప్పేసే సాయి పల్లవిని ..బాగా ఇబ్బంది పెట్టిన ఆ పాట ఏంటో తెలుసా..?

సాయి పల్లవి .. అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఆమె డాన్స్ . ఆఫ్ కోర్స్ అందంగా ఉంటుంది .. బాగా నటిస్తుంది కానీ సాయి పల్లవి డాన్స్ చేస్తే మాత్రం ఎలాంటి వాళ్ళైనా సరే కళ్ళు ఆర్పకుండా అలా అలా చూస్తూనే ఉంటారు . అంతటి టాలెంటెడ్ అంత చక్కగా వేస్తుంది . బాడీని గిరిగిరా తిప్పేస్తూ ఉంది. ఆమె నటించిన ప్రతి సినిమాలోనూ సాయి పల్లవి ఏ విధంగా డాన్స్ తో మెప్పించిందో మనం చూసాం.

అయితే అలాంటి సాయి పల్లవికి ఒక పాటకు స్టెప్స్ వేయడం బాగా కష్టంగా అనిపించిందట. ఇప్పటికీ ఆ పాటకు స్టెప్స్ వేయలేక ఇబ్బంది పడుతుందట. ఆ పాట మరేదో కాదు ముఠామేస్త్రి సినిమాలోని మార్కెట్లో వచ్చే సాంగ్ . ఆ పాట కి స్టెప్స్ వేయడానికి కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తుందట. అయినా సరే ఆమె సక్సెస్ కాలేకపోతుందట . “మే బి అబ్బాయిల బాడీకి ఆ స్టెప్స్ బాగా సూట్ అవ్వచ్చు అనుకుంటున్నాను ..అందుకే నా బాడీకి ఎంత ట్రై చేసిన మ్యాచ్ అవ్వలేదు ” అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


ప్రెసెంట్ హీరోయిన్ సాయి పల్లవి కోలీవుడ్ – టాలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తుంది. టాలీవుడ్ లో రెండు సినిమాలు.. కోలీవుడ్లో మూడు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధం అవుతుంది. గతంలో చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినా సరే ఎందుకో సాయిపల్లవి ఆయన ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఈ విషయానొ ఒపెన్ గా చెప్పుకొచ్చాడు చిరంజీవి..!!