రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న బాలయ్య ఆల్ టైం బ్లాక్ బస్టర్.. అభిమానులకు పండగే..

టాలీవుడ్ ఫ్రాక్షన్ సినిమాల్లో కొత్త వరవడికి నాంది పలికి.. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమాల లిస్టులో మొదట ఉండేది బాలయ్య సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతి బరిలో భారీ పోటీని తట్టుకొని.. కొన్ని కేంద్రాల్లో ప్రింట్లు ఆలస్యంగా చేరుకున్న అవాంతరాలను తట్టుకొని సక్సెస్ అందుకుంది. కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించి.. సంక్రంతి బ‌రిలో విజ‌యం సాధించింది. చాలా ధియేటర్లలో ఈ సినిమాతో వచ్చిన లాభాలతోనే రీ మోడలిం,గ్ సౌండ్ సిస్టం ఆధునికరణ ఇలాంటివి చేశారంటూ పత్రికల్లో కోకలలుగా వార్తలు కూడా వచ్చాయి. ఆ రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అందుకుంది.

29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పుడు ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మార్చి 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలు మాస్టర్ ప్రింట్ తో పాటు 7.1 డాల్బీ సౌండ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి యూత్ లో ఈ మూవీ కల్ట్ ఫాలోయింగ్ గురించి తెలియ‌క పోవ‌చ్చు. కానీ అప్ప‌ట్లో ఈ మూవీ ఓ భీభ‌త్సం. ఈ సినిమాలో బాలయ్య విశ్వరూపం చూపించారు. ఫస్ట్ హాఫ్ లో అబ్బులుగా కామెడీ, ప్లస్ ఎమోషన్ పండించిన ఈయన సెకండ్ హాఫ్ లో వీర‌సింహారెడ్డిగా మాస్ యాక్షన్ తో మరో యాంగిల్ ను చూపించారు..

సిమ్రాన్, అంజలి జవేరి హీరోయిన్లుగా నటించారు, మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఓ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ, ఈ మూవీ ప్రభావం ఇండస్ట్రీలో బాగా పడిందనే చెప్పాలి, ఈ సినిమా తర్వాత సినిమా ఫ్రాక్షన్ ని బేస్ చేసుకుంటూ వందకు పైగా సినిమాలు తెరకెక్కయి, ఇక ఇటీవల స్లో అయిన ఈ రీరిలీజ్ ట్రెండ్‌కు మళ్ళీ శ్రీకారం చుట్టింది పవన్ కళ్యాణ్ గంగతో రాంబాబు మూవీ. ఇక ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ రోజునే.. రవితేజ కిక్ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.