ఏంటి..మా ప్రభాస్ కి ఓ రూల్.. మీ మహేశ్ కి మరో రూల్ నా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఏపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. మనకు తెలిసిందే రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది . కానీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రికార్డులను మాత్రం బద్దల కొట్టలేకపోయింది . కాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోని 90% స్క్రీన్ లో గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది . కొన్ని ఏరియాలలో బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి .

అయితే గుంటూరు కారం సినిమా టికెట్ రేట్లను పెంచుతూ తెలంగాణ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . గుంటూరు కారం సినిమాకు తెలంగాణలో 65 రూపాయలు నుంచి 100 రూపాయలు చొప్పున టికెట్లు రేట్లు పెంచారు . అంతేకాదు ఏపీలో 50 రూపాయల మేరా టికెట్ రేటు పెంపు లభించింది . అయితే సలార్ సినిమాకి మాత్రం 40 రూపాయల పెంపుకు అనుమతులు ఇచ్చిన జగన్ గవర్నమెంట్ ఎందుకు గుంటూరు కారం సినిమాకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు అన్న క్వశ్చన్స్ లేవదీస్తున్నారు రెబల్ అభిమానులు.

జనాలు కూడా మండి పడుతున్నారు గుంటూరు కారం సినిమాకు 50 రూపాయలు.. ప్రభాస్ సినిమాకి 40 రూపాయలా.. ఏంటి..? ఈ వ్యత్యాసం.. ఇంత దారుణమా..?? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఏ పి ప్రభుత్వం పై రెబల్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరి కొద్ది గంటల్లో గుంటూరు కారం సినిమా రిలీజ్ అనగా ఈ తలనొప్పులు ఏంట్రా సామీ అంటూ మహేశ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు..!!