“భయపడకండి..ఆ టైం లో ఇలా చేస్తే సరిపోతుంది”..అమ్మాయిలకు రష్మిక స్పెషల్ సజెషన్..!!

అమ్మాయిలు అందంగా ఉండడానికి ఎంత తాపత్రయపడుతూ ఉంటారో మనకు తెలిసిందే. ముఖానికి నానారకాల క్రీములు రాస్తూ ఉంటారు. ఫుడ్ డైట్లు ఫాలో అవుతూ ఉంటారు. రకరకాల డైటింగ్లు చేస్తూ ఉంటారు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు కూసింత ఎక్కువగానే అందంపై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు . కానీ వాళ్లకి ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా కొన్నిసార్లు వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోలేకపోవచ్చు.

డైట్ ఫాలో అవుతున్న సరే నిద్రలేని రాత్రులు గడపడం ద్వారా వాళ్ళ చర్మం బాగా డల్ అయిపోతుంది . కళ్ళ కింద మడతలు నల్లగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది . అలాంటి సమయంలో ఏం చేయాలో రష్మిక మందన్నా అద్భుతమైన చిట్కా ఇచ్చింది . సౌత్ ఇండియాలోనే పాపులారిటి సంపాదించుకున్న రష్మిక.. రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటోని షేర్ చేసింది . ఫేస్ కి ఒక మాస్క్ వేసుకొని ఉన్న ఫోటోలు షేర్ చేసి ..

“అమ్మాయిలు ఎవరైనా సరే టైం లేనప్పుడు ఇలా చేయండి.. మనం బిజీగా ఉండడం ద్వారా కనీసం నిద్ర కూడా లేకపోవడం ద్వారా ఎక్కువ ప్రయాణం చేయడం ద్వారా చర్మం దెబ్బతింటుంది. కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్లే టైం కూడా ఉండదు. అప్పుడు ఏం చేయలేం ఒక ఫేస్ మాస్క్ ఉపయోగించుకోవడం సరైన పని “అంటూ సజెస్ట్ చేసింది. ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మొత్తానికి అమ్మాయిలకి బాగా ఉపయోగ పడే చిట్కా నే ఇచ్చింది రష్మిక..!!