‘ హనుమాన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ఆయన బలానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

గత కొంతకాలంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హనుమాన్. జనవరి 12న సంక్రాంతి బరిలో రావలసిన ఈ సినిమాకు ఒకరోజు ముందే స్పెషల్ షూస్ పడ్డాయి. దీంతో ఇప్పుడు రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ రికార్డ్‌లు క్రియేట్ చేసింది. జస్ట్ టీజర్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రశాంత్ వర్మ.. విజువల్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్ల అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. జాంబిరెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ తేజ కాంబోలో వస్తున్న ఈ సినిమాకి ఇప్పటికే ఆడియన్స్ ప్రీమియర్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేశారు.

Hanuman Twitter Review: 'హనుమాన్' ట్విట్టర్ రివ్యూ.. అదిరిపోయింది.. ఆ 20 నిమిషాలు గూస్ బంప్స్ అంతే.. - Telugu News | Hanuman Movie Twitter Review in Telugu starrer Teja Sajja and Director ...

ఇక నిన్ననే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ప్రీమియర్ షోస్ హిందీ మూవీ చూసిన ఆడియన్స్ అంతా సినిమా అదిరిపోయింది అంటూ ఫెంటాస్టిక్ అంటూ కామెంట్స్ చేశారు. ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల హనుమన్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను తెలియజేశారు. ఒకసారి ట్విట్టర్ రివ్యూ ఏ విధంగా ఉందో సమీక్షలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ మెడ్ లెవెల్టిక్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రా ఆర్డినరీ.. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటూ ఒకరు రివ్యూ చెప్పారు.

Hanuman Movie | 'హనుమాన్‌' టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్‌ ఎప్పుడంటే?-Namasthe Telangana

మరొకరు చివరి 20 నిమిషాలు మాత్రం ప్రేక్షకుడికి గూస్‌బంస్‌ తెప్పించే విధంగా ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు. ఇక సినిమాలో తేజ పర్ఫామెన్స్ వేరే లెవెల్ అంటూ యాక్షన్, కామెడీ చాలా బాగా కుదిరిందంటూ మ‌రో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. డైలాగ్స్, యాక్షన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్ని సినిమాకు హైలైట్ గా నిలిచాయి అంటూ ఒకరు రివ్యూ ఇచ్చారు. ప్రధాన బలం తేజ యాక్టింగ్ అంటూ రివ్యూలలో వివరించారు. హ‌నుమాన్ బలానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటివరకు వచ్చిన ప్రేక్షకుల ట్విట్టర్ రివ్యూ ను బట్టి సినిమా ప్రేక్షకులను ఆలరించినట్లు తెలుస్తుంది. విజువల్స్, యాక్షన్, కామెడీ అన్ని విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న హనుమాన్.. చివరి 20 నిమిషాలు ప్రేక్షకుడిలో గుసుబంస్ తెప్పించే విధంగా ఉంటుందట‌.