‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రశాంత్ వర్మ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లేనా..?!

మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కాన్ఫిడెన్స్ ను వదలలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పోటీగానే తన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో అదే రోజున రిలీజ్ చేశాడు. ఇక (జనవరి 12న) ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ కు ముందే బుకింగ్స్ లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నిన్న ప్రీమియర్ షోస్ తో అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోస్ అంటే ఏదో ఐదారు స్క్రీన్లు కాదు ఏకంగా 300 స్క్రీన్ లో ప్రీమియర్ షో వేశారు. మొత్తం అన్ని సినిమా ధియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. దీన్ని బట్టి హనుమాన్‌ రిలీజ్‌కి ముందు ఏ రేంజ్ లోకి వచ్చిందో తెలుసుకోవచ్చు.

Hanuman Movie | హనుమాన్‌ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?-Namasthe Telangana

ఇక ఓ సామాన్యుడికి అద్వితీయమైన శక్తులు వస్తే సూపర్ హీరో అవ్వడం.. వాటిని దక్కించుకునేందుకు.. ఓ విలన్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాడో.. ఈ సినిమాలో చూపించారు. ఈ క్రమంలో అతని వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం.. వాటి నుంచి హీరో వారిని కాపాడడం.. దాదాపు అన్ని సూపర్ హీరోల సినిమాల లాగానే ఇది కూడా కొనసాగింది. అయితే ఈ సినిమాను మన ఇతిహాసంతో ముడిపెట్టి నేటివిటీ మిస్ కాకుండా ఇంట్రెస్టింగ్గా తెరపై చూపించాడు ప్రశాంత్ వర్మ. మన ఇతిహాసాల్లో రియల్ సూపర్ హీరో హనుమంతుడే. మరి ఆయన శక్తులన్నీ ఓ సామాన్యునికి వస్తే ఏం జరుగుతుంది.. ఊరు ప్రజలను రక్షించేందుకు ఏం చేశాడో.. ఈ సినిమాలో క్లుప్తంగా వివరించారు.

Dulquer Salmaan releases first look poster of 'Hanu-Man'

ఇక ఈ సినిమాలో యాక్షన్, విజువల్స్, కామెడీ అన్ని సమృద్ధిగా ఉన్నాయి. హనుమాన్ పాత్రలో సామాన్య కుర్రాడిలా తేజ ఒదిగిపోయినటించాడు. సూపర్ పవర్స్ వచ్చాక అతను చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాక్షన్, సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా అత్యంత ఆసక్తిగా సాగింది. అక్కడక్కడ డెల్ అయిన సినిమా విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఆఖరి 20 నిమిషాలు అయితే గూస్‌బంస్‌ తెప్పించే విధంగా ఉంది. మొత్తానికి సినిమా అయితే ప్రేక్షకులను మెప్పించింది. కచ్చితంగా ఈ సినిమాను సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు.