విటమిన్ సి అధికంగా లభించే ఫ్రూట్స్ ఇవే..!

సాధారణంగా చాలామంది విటమిన్ సి అందడానికి అనేక ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కూడా విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి, శ్వాసకోస సమస్యలు రాకుండా చూడడానికి విటమిన్ సి చాలా అవసరం. ఇక కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ విటమిన్ సి తీసుకునే వారు సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ విటమిన్ సి అధికంగా లభించే పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. విటమిన్ సి అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది నిమ్మకాయ. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెంచుతుంది.

2. శీతకాలంలో నారింజ పండ్లు అధికంగా లభిస్తాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

3. చలికాలంలో జామ పండ్లు విరివిరిగా లభిస్తాయి. ఈ పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇక దీంతో ఫైబర్ బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి.

4. క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు దానిమ్మకాయని తినడం చాలా ఉత్తమం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం కారణంగా మీ శరీరానికి తగినంత పోషకాలు అందుతాయి.

పైన చెప్పిన పండ్లలో మాత్రమే విటమిన్ సి ఉండదు.. స్ట్రాబెర్రీ, కివీ, ద్రాక్ష వంటి పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.