గుంటూరు కారం నుంచి ఆ డైలాగులు తీసేయాలి.. ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్..!

ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. అంతేకాదు సినిమా పాజిటివ్ టాక్ కూడా దక్కించుకునింది . కానీ మహేష్ బాబు స్థాయికి ఈ సినిమా సరిపోదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

మరీ ముఖ్యంగా సినిమాలో మహేష్ బాబు నటన శ్రీ లీల డాన్స్ తప్పిస్తే మరేదీ లేదు అన్న కామెంట్స్ మరింత స్థాయిలో వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ దళితులను తన సినిమాలు ఇన్ సల్ట్ చేశాడు అంటూ కొందరు జనాలు మండిపడుతున్నారు . దళితులను కించపరిచే విధంగా ఉన్న కొన్ని డైలాగ్స్ తీసేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . “నువ్వు క్రిస్టియన్ వి ఏంటారా..?” అనే డైలాగ్ ను తీసేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు .

అంతేకాదు కావాలనే కొందరికి దళితులను కించపరిచే విధంగా పేర్లను పెట్టారని మండిపడుతున్నారు . కొన్ని కొన్ని డైలాగ్స్ చాలా హర్టిం గా ఉన్నాయి అంటూ వాటిని డిలీట్ చేయాలి అన్న డిమాండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. గుంటూరు కారం సినిమాతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తున్నాడు సూపర్ స్టార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో హీరోయిన్ గా శ్రీలీల సందడి చేసింది.