వెంకటేష్ “సైంధవ్” సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదేగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చేది మన వెంకీ. అంతటి స్థాయిని సంపాదించుకున్నాడు . తొడ కొట్టడాలు.. మీసం మెలివేయడాలు చేస్తున్న హీరోల సినిమాలు చూడలేకపోతున్న ఆడవాళ్లను థియేటర్స్ కి రప్పించే ఘనత అందుకున్నాడు మన వెంకి . అలాంటి వెంకీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాతో మన ముందుకు వచ్చాడు .

రీసెంట్గావెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మొదటి షో తోనే బొమ్మ సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . ఈ సినిమాలో వెంకటేష్ నటన చాలా అద్భుతంగా ఉంది .అంతేకాదు హీరోయిన్ శ్రద్ధా నాధ్ కూడా బాగా నటించింది . ఫ్యామిలీ సెంటిమెంట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . అయితే డైరెక్టర్ శైలేష్ కొలను ఈ పాత్రను ముందుగా బాలకృష్ణ కోసం రాసుకున్నారట .

ఆయనకు కథ కూడా వివరించారట . కానీ ఈ సినిమా నాకు సెట్ అవ్వదు అంటూ బాలకృష్ణ రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత కొంతమంది హీరోల వద్దకు ఈ కథ వెళ్లిన ఫైనల్ వెంకటేష్ చేతికి అదృష్టం దక్కింది. విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన సినిమా సైంధవ్. ఆయనకి ఇది 75వ చిత్రం. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈసినిమాలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటించారు.